Hyd ORR Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే-orr exit number 2 and 7 closed due to water logging ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyd Orr Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే

Hyd ORR Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే

Published Jul 27, 2023 03:50 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 27, 2023 03:50 PM IST

  • Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జంట జలాశయాలు పొంగిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో నగరంలోని చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో నెహ్రు ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు చేసే వారికి అలర్ట్ ఇచ్చారు అధికారులు. 

హైదరాబాద్ చుట్టు విస్తరించి ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు.

(1 / 7)

(twitter)

ఓఆర్ఆర్ 2, 7 ఎగ్జిట్‌ పాయింట్లు నీరు నిలిచిపోవడంతో మూసివేస్తున్నట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ట్వీట్ చేశారు.  వీలైనంత త్వరగా తిరిగి తెరుస్తామని తెలిపారు. నీటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

(2 / 7)

వారం రోజులకుపైగా కురుస్తున్న వర్షాలకు  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) బురదమయంగా మారింది. భారీ వాహనాలు వెళ్లే 3-4 లేన్లలో అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అధిక లోడుతో వస్తున్న భారీ వాహనాలు 3, 4 లేన్లలో బిట్టీ (తారు) లేపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్డు ఎక్కడికక్కడ దెబ్బతింది.

(3 / 7)

కోకాపేట నుంచి గచ్చిబౌలి, కొల్లూరు నుంచి పటాన్‌చెరు, ఘట్‌కేసర్‌ నుంచి పెద్దంబర్‌పేట, కండ్లకోయ నుంచి పటాన్‌చెరు వరకు గుంతలమయమయ్యాయి. వీటిని పూడ్చే పనిలో పడింది సిబ్బంది. నగరంలో భారీ వర్షంతో చాలా మంది ఓఆర్ఆర్ పై రాకపోకలు చేస్తున్నారు. ఫలితంగా భారీగా వాహనాలు వస్తున్నాయి.

(4 / 7)

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప ర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు.

(5 / 7)

రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావిత పట్టణాల్లో ఉన్న పరిస్థితులపైన పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 

(6 / 7)

ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని... భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్ష ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం పెంచేలా నాయకులు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. గండి పడే ప్రమాదం ఉన్న చెరువులను సమీక్షిస్తున్నామని… మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు