(1 / 5)
భక్తులకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
(https://yadadritemple.telangana.gov.in/)(2 / 5)
యాదాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చినట్లు అధికారులు ప్రకటించారు. http://yadadritemple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం, పూజ కైంకర్యాల టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
(https://yadadritemple.telangana.gov.in/)(3 / 5)
పైన పేర్కొన్న వెబ్‌సైట్ నుంచే ఈ హుండీకి విరాళాలు ఇవ్వ వచ్చునని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
(Twitter)(4 / 5)
ఆన్ లైన్ పోర్టల్ సేవలు మే 23వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తరహా సేవలను ప్రవేశపెట్టారు.
(Photo Source Twitter)(5 / 5)
యాదాద్రిలో వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఉంది.,
(Photo Source Twitter)ఇతర గ్యాలరీలు