Ongole Breed Cow : ఒంగోలు జాతి ఆవు వరల్డ్ రికార్డ్, వేలంలో రూ.40 కోట్ల ధర
Ongole Breed Cow : ఒంగోలు బ్రీడ్ ఆవులు, ఎద్దులకు దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉంది. సాధారణంగా వీటి ధర లక్షల్లో ఉంటుంది. దేశంలోని ఇతర జాతుల పశువులతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువ. అయితే ఒంగోలు బ్రీడ్ కు చెందిన ఓ ఆవు వేలంలో ఏకంగా రూ.40 కోట్లు పలికింది.
(1 / 7)
ఒంగోలు బ్రీడ్ ఆవులు, ఎద్దులకు దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉంది. సాధారణంగా వీటి ధర లక్షల్లో ఉంటుంది. దేశంలోని ఇతర జాతుల పశువులతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువ. అయితే ఒంగోలు బ్రీడ్ కు చెందిన ఓ ఆవు వేలంలో ఏకంగా రూ.40 కోట్లు పలికింది.
(2 / 7)
ఇటీవల బ్రెజిల్ దేశంలో జరిగిన ఓ వేలంలో వయాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.40 కోట్లు ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డులకెక్కింది. ఇది ఒంగోలు జాతికి చెందిన ఆవు కావడం విశేషం.
(3 / 7)
ప్రపంచంలో అత్యంత ఖరీదైన జాతులుగా జపాన్‌కు చెందిన వాగ్యు, భారత్‌కు చెందిన బ్రాహ్మణ్‌లను... బ్రెజిల్‌లోని మినాస్ గెరెయిస్ కు చెందిన వయాటినా-19 వేలంలో వెనక్కి నెట్టింది.
(4 / 7)
ఒంగోలు జాతికి ఉండే ఆవులు చాలా దృఢమైన శరీర సౌష్ఠవం కలిగి ఉంటాయి. తెల్లటి శరీర రంగుతో మిలమిల మెరుస్తూ భారీగా ఉన్న వయాటినా వేలంలో వ్యాపారులను ఆకర్షించింది. ఈ జాతి ఆవుల పైచర్మం వదులుగా ఉండటం వల్ల ఎంతటి ఉష్ణ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవు.
(5 / 7)
ఒంగోలు జాతి అయినప్పటికీ సాధారణ ఆవు కంటే భారీ సైజ్ లో వయాటినా-19 ఉంటుంది. దీని బరువు 1,101 కిలోలు. అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో వయాటినా చోటు సాధించింది.
(6 / 7)
ఎంతో అందమైన మూపురంతో చూపరులను ఆకట్టుకున్న వయాటినా-19, ఆవుల ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని సైతం దక్కించుకుంది.
(7 / 7)
1868లో బ్రెజిల్‌కు తొలిసాగి ఏపీలోని ఒంగోలు పశువులను తీసుకెళ్లారు. క్రమంగా ఈ జాతి పశువులను బ్రెజిల్ లో పెంచడం ప్రారంభమైంది. ఒంగోలు ఆవులు అత్యంత వేడి ఉష్ణోగ్రతలను తట్టుకునే సామార్థ్యం, సమర్థవంతమైన జీవక్రియ, ఇన్‌ఫెక్షన్‌లను తట్టుకుని నిలబడతాయి. దీంతో బ్రెజిల్ పశువుల పెంపకందారులు వీటి కొనుగోలకు మక్కువ చూపారు.
ఇతర గ్యాలరీలు