తెలుగు న్యూస్ / ఫోటో /
TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై మరో అప్డేట్ - ఈనెల 24 లోపు లబ్ధిదారుల గుర్తింపు, ఇవిగో తాజా వివరాలు
- New Ration Cards in Telangana : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలో ‘వన్ స్టేట్ - వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
- New Ration Cards in Telangana : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలో ‘వన్ స్టేట్ - వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
(1 / 7)
కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
(2 / 7)
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం నేపథ్యంలో… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో ‘వన్ స్టేట్ - వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
(3 / 7)
తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
(4 / 7)
రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
(5 / 7)
జనవరి 26వ తేదీ నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించగా… అంతకంటే ముందే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది. అంటే లబ్ధిదారులను జనవరి 26వ తేదీలోపే గుర్తించాల్సి ఉంటుంది. జనవరి 24లోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
(6 / 7)
రేపోమాపో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆఫ్ లైన్ లో ఉంటుందా..? లేక ఆన్ లైన్ లో ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆఫ్ లైన్ లో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
(7 / 7)
ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటివి 10 నుంచి 12 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను కూడా ప్రభుత్వం క్లియర్ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 నుంచి 12 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు