TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్స్ - అర్హుల జాబితాలపై రీవెరిఫికేషన్, 3 కేటగిరిలుగా విభజన..!-once again verification of indiramma housing scheme applications in telangana latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్స్ - అర్హుల జాబితాలపై రీవెరిఫికేషన్, 3 కేటగిరిలుగా విభజన..!

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్స్ - అర్హుల జాబితాలపై రీవెరిఫికేషన్, 3 కేటగిరిలుగా విభజన..!

Jan 31, 2025, 09:05 AM IST Maheshwaram Mahendra Chary
Jan 31, 2025, 09:05 AM , IST

  • TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రాథమికంగా గుర్తించిన అర్హుల జాబితాను రీవెరిఫికేషన్ చేయాలని గృహ నిర్మాణశాఖ నిర్ణయించింది. అంతేకాదు లబ్ధిదారుల గుర్తింపునకు దరఖాస్తులను కేటగిరిలుగా విభజించనుంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొందరికి ప్రోసిడింగ్స్ కూడా అందాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

(1 / 8)

అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రాథమిక జాబితాలు ఇప్పటికే ఖరారయ్యాయి. అయితే ఇందులో ఉన్న పేర్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర గృహా నిర్మాణశాఖ నిర్ణయించింది. అన్ని కోణాల్లో పరిశీలించి… లబ్ధిదారుల జాబితాలను తయారు చేయనున్నారు. 

(2 / 8)

 ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి లబ్ధిదారులనుఎంపిక చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్  కమిషనర్లకు రాష్ట్ర హౌసింగ్  కార్పొరేషన్ నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గురువారం సర్క్యూలర్ జారీ అయింది. 

(3 / 8)

పాత దరఖాస్తులే కాకుండా… గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని హౌసింగ్  కార్పొరేషన్ స్పష్టం చేసింది. అనర్హులకు ఇవ్వొద్దని, అలాంటి వారిని గుర్తించి పక్కన పెట్టాలని సూచించింది. 

(4 / 8)

రీవెరిఫికేషన్ ప్రాసెస్ మాత్రమే కాకుండా… ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను కేటగిరిలుగా విభజించారు. L1, L 2, L3 కేటగిరిలుగా చేసి.. లబ్ధిదారులను ఫైనల్ చేయనున్నారు. 

(5 / 8)

సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచుతారు. ఇక  ఎల్ 2 లో స్థలం, ఇల్లు రెండూ  లేనివాళ్ల పేర్లను చేరుస్తున్నారు. ఎల్ 3లో అద్దె ఇంట్లో ఉన్నవారు, రేకుల షెడ్, పెంకుటిండ్లలో ఉన్నవారి పేర్లను ఎక్కిస్తున్నారు.

(6 / 8)

ఇక మొదటి దశలో సొంత జాగ ఉండి ఇళ్లు లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెండో దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని పేర్కొంది. అంటే ఈ తొలి విడతలో సొంత జాగ ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు రానున్నాయి.

(7 / 8)

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఫైనల్ చేసే క్రమంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. లబ్ధిదారులను గుర్తించే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడాలని కూడా నిర్ణయించింది. పకడ్బందీగా ఈ స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు