(1 / 6)
నైరుతి రుతుపవనాలు మే 24న (శనివారం) కేరళలోకి ప్రవేశించాయి. ఈసారి సాధారణ తేదీ కంటే 8 రోజుల ముందుగా కేరళ తీరాన్ని తాకాయి. గతంలో 2009లో మే 23 ఇలానే ముందుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. 2009 నుంచి రుతుపవనాలు కేరళను తాకిన తేదీలు ఇలా ఉన్నాయి.
(unsplash)(2 / 6)
2009లో మే 23, 2010లో మే 31, 2011లో మే 29, 2012లో జూన్ 05, 2013లో జూన్ 01, 2014లో జూన్ 06, 2015లో జూన్ 05, 2016లో జూన్ 08వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
(unsplash)(3 / 6)
2017లో 30 మే, 2018లో మే 29, 2019లో జూన్ 08, 2020లో జూన్ 01, 2021లో జూన్ 03, 2022లో మే 29, 2023లో జూన్ 08, 2024లో మే 30, 2025లో మే 24వ తేదీల్లో కేరళలోకి ప్రవేశించాయి. 2009 తర్వాత మళ్లీ ఈ ఏడాది మాత్రమే తొందరగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
(unsplash)(4 / 6)
రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. మే 26 నాటికి రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. మరికొన్ని నివేదికల ప్రకారం.. జూన్ రెండో వారం నుండి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా.
(unsplash)(5 / 6)
రుతుపవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం కొంచెం ముందుగానే వచ్చే అవకాశం ఉంది. కేరళ తీరాన్ని తాకిన వారం రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
(unsplash)(6 / 6)
నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయని.. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి రైతులకు అనుకూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
(unsplash)ఇతర గ్యాలరీలు