యోగినీ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఈ రెండింటిని సమర్పిస్తే శ్రేయస్సు చేకూరుతుంది.. కష్టాలు తొలగిపోతాయి!-offer these two things to maha vishnu on yogini ekadashi for special blessings and happiness ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  యోగినీ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఈ రెండింటిని సమర్పిస్తే శ్రేయస్సు చేకూరుతుంది.. కష్టాలు తొలగిపోతాయి!

యోగినీ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఈ రెండింటిని సమర్పిస్తే శ్రేయస్సు చేకూరుతుంది.. కష్టాలు తొలగిపోతాయి!

Published Jun 19, 2025 10:21 AM IST Peddinti Sravya
Published Jun 19, 2025 10:21 AM IST

ప్రతీ నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు మహా విష్ణువును ఆరాధిస్తే ప్రత్యేక ఫలితాలను పొందవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచిది. యోగినీ ఏకాదశి తేదీ, సమాయంతో పాటు ఆరోజు విష్ణువుకు సమర్పించాల్సిన రెండింటి గురించి తెలుసుకుందాం.

ఏకాదశి తిథిని హిందూమతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. ఈ ఉపవాసం ప్రతి నెలా కృష్ణ, శుక్ల పక్షం పదకొండవ రోజున ఆచరిస్తారు.

(1 / 6)

ఈ ఏడాది యోగిని ఏకాదశి జూన్ 21న ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండటం 88,000 మంది బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడంతో సమానమని నమ్ముతారు. అంతే కాదు, ఉపవాసం ప్రభావం వల్ల వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతాడు. అయితే ఏకాదశి నాడు ఈ రెండింటినీ విష్ణువుకు సమర్పించడం వల్ల సంతోషం కలుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

(2 / 6)

యోగిని ఏకాదశి తిథి: జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిథి జూన్ 21 ఉదయం 07:18 గంటలకు ప్రారంభమవుతుంది. 22వ తేదీ తెల్లవారు జామున 04.27 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న యోగిని ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించనున్నారు.

(3 / 6)

యోగిని ఏకాదశి శుభయోగం: పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి నాడు అశ్విని నక్షత్రం ఏర్పడుతుంది, ఇది రాత్రి 7:50 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున అతిగండ యోగం కూడా ఏర్పడుతుంది, ఇది రాత్రి 8:28 గంటల వరకు ఉంటుంది.

(4 / 6)

పాయసం: యోగిని ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పాయసాన్ని సమర్పించండి. దీనితో భగవంతుడు సంతోషించి సాధకునిపై తన ఆశీస్సులను కురిపిస్తాడని నమ్ముతారు.

(5 / 6)

పంచామృతం: ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పంచామృతాన్ని సమర్పించండి, పాలు, పెరుగు, తేనె, చక్కెర మరియు నెయ్యిని కలిపి సమర్పించాలి. ఇది జీవితంలో శాంతిని తెస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

(6 / 6)

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

ఇతర గ్యాలరీలు