heat stroke: వడదెబ్బను నివారించటానికి న్యూట్రిషనిస్ట్ తెలిపిన సూచనలు ఇవిగో!
- heat stroke: వడదెబ్బ అనేది వేసవిలో తలెత్తే ఒక ప్రమాదకరమైన సమస్య. హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
- heat stroke: వడదెబ్బ అనేది వేసవిలో తలెత్తే ఒక ప్రమాదకరమైన సమస్య. హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
(1 / 7)
హీట్ స్ట్రోక్ అనేది శరీరంలోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ దాని సామర్థ్యానికి మించి వేడెక్కినప్పుడు సంభవించే పరిస్థితి. వెంటనే చికిత్స అందించకపోతే వ్యక్తి మరణించడం లేదా శాశ్వత వైకల్యానికి కారణం కావచ్చు. ఎండదెబ్బను నివారించటానికి న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ కొన్ని ఆరోగ్య చిట్కాలను పంచుకుంది.(Unsplash)
(2 / 7)
శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోవడం, తలనొప్పి, వికారం మొదలైనవి హీట్ స్ట్రోక్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు. (Unsplash)
(3 / 7)
ఈ వేడిలో ఎక్కువ నీరు త్రాగడం ఉత్తమం. పాలకూర, దోసకాయ, పుదీనా రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. (Unsplash)
(4 / 7)
విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు దాహాన్ని తీర్చడంలో సహాయపడతాయి , శరీరానికి శీతలకరణిగా పని చేస్తాయి. (Unsplash)
(6 / 7)
దాల్చినచెక్క, నెయ్యి వంటి పదార్ధాలను తక్కువ తినాలి. కోకమ్, పచ్చి మామిడి, పెరుగు వంటి చల్లని పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. (Unsplash)
(7 / 7)
కాటన్ దుస్తులు, వదులుగా గాలి ప్రసరించేలా బట్టలు ధరించాలి. ఇవన్నీ వేసవిలో హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని అరికట్టడంలో సహాయపడతాయి.(Unsplash)
ఇతర గ్యాలరీలు