Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన నొవాక్ జోకొవిచ్.. క్వార్టర్స్‌లో అల్కరాజ్‌ను చిత్తు చేసిన స్టార్
- Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ విజయం సాధించాడు. కార్లోస్ అల్కరాజ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయినా తర్వాత పుంజుకొని అతన్ని ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.
- Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ విజయం సాధించాడు. కార్లోస్ అల్కరాజ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయినా తర్వాత పుంజుకొని అతన్ని ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.
(1 / 6)
Novak Djokovic: నొవాక్ జోకొవిచ్ తనకు కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరోసారి సెమీఫైనల్ చేరాడు. గత రెండు వింబుల్డన్ ఫైనల్స్ లో తనను ఓడించిన అల్కరాజ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 25వ గ్రాండ్‌స్లాట్ టైటిల్ వైపు మరో అడుగు వేశాడు.
(AFP)(2 / 6)
Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో జోకొవిచ్, అల్కరాజ్ తలపడ్డారు. రాడ్ లేవర్ ఎరీనాలో జోకర్ తన మార్క్ చూపించాడు. అల్కరాజ్ తొలి సెట్ గెలిచాడు. కానీ తర్వాత మొత్తం జోకొవిచ్ హవా నడిచింది.
(AFP)(3 / 6)
Novak Djokovic: క్వార్టర్ ఫైనల్స్ తొలి సెట్ ను కార్లోస్ అల్కరాజ్ 6-4తో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్ ను 4-6తో చేజార్చుకున్నాడు. ఆ వెంటనే మూడో సెట్ ను కూడా 6-3తో జోకొవిచ్ గెలిచాడు.
(4 / 6)
Novak Djokovic: నాలుగో సెట్లో అల్కరాజ్ సర్వీస్ ను కూడా జోకొవిచ్ బ్రేక్ చేయగలిగాడు. చివరికి జోకర్ నాలుగో సెట్ ను 6-4తో గెలిచాడు. క్వార్టర్ ఫైనల్స్ లో నొవాక్ 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరుకున్నాడు. నాలుగు సెట్ల క్వార్టర్ ఫైనల్ పోరు 3 గంటల 37 నిమిషాల పాటు సాగింది.
(AP)(5 / 6)
Novak Djokovic: ప్రొఫెషనల్ సర్క్యూట్ లో జోకొవిచ్ ఎనిమిది సార్లు అల్కరాజ్ తో తలపడ్డాడు. 5 మ్యాచ్ లలో విజయం సాధించాడు. అల్కరాజ్ మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించాడు.
(Reuters)ఇతర గ్యాలరీలు