AP Govt Jobs : ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ.35 వేలు.. పూర్తి వివరాలు ఇవే-notification released for recruitment of jobs in andhra pradesh endowment department ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Govt Jobs : ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ.35 వేలు.. పూర్తి వివరాలు ఇవే

AP Govt Jobs : ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ.35 వేలు.. పూర్తి వివరాలు ఇవే

Dec 28, 2024, 02:25 PM IST Basani Shiva Kumar
Dec 28, 2024, 02:25 PM , IST

  • AP Govt Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 

(1 / 5)

ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. (istockphoto)

ఏఈఈ పోస్టులకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

(2 / 5)

ఏఈఈ పోస్టులకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.(istockphoto)

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 35 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) 5 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) 30 పోస్టులు ఉన్నాయి. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. 

(3 / 5)

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 35 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) 5 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) 30 పోస్టులు ఉన్నాయి. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. (istockphoto)

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. 

(4 / 5)

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. (istockphoto)

నెలకు ఏఈఈకి రూ.35,000, టీఏకు రూ.25,000 వేతనం ఉంటుంది. జీతంతో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 05.01.2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

(5 / 5)

నెలకు ఏఈఈకి రూ.35,000, టీఏకు రూ.25,000 వేతనం ఉంటుంది. జీతంతో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 05.01.2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. (istockphoto)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు