(1 / 8)
ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 1,620 ఉన్నాయి. ఇందుకు వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉన్నాయి.
(2 / 8)
ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలను కేవలం 7వ తరగతి అర్హతతోనే రిక్రూట్ చేయనున్నారు. 651 ఖాళీలు ఉండటంతో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 7వ తరగతిలో ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. ఉన్నత చదవులు చదివిన వారిని పరిగణనలోకి తీసుకోరు.
(3 / 8)
7వ తరగతి అర్హత మాత్రమే కాకుండా కొన్ని రంగాల్లో నైపుణ్యాలు ఉండాలి. వంట చేయటం, కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ తో పాటు ఇతర పనుల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.
(4 / 8)
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి. అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా తెలిసి ఉండాలి.
(5 / 8)
2025 జులై 1వ తేదీ నాటికి 18 - 42 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. మొత్తం 40 ప్రశ్నలు ఉండగా… ఇందులో జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు కేటాయిస్తారు.
(6 / 8)
రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుండగా… జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి.
(7 / 8)
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. హాల్ టికెట్లతో పాటు రాత పరీక్ష తేదీలను కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు.
(8 / 8)
ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు https://aphc.gov.in/docs/06052025-10.pdf లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదా ఏపీ హైకోర్టు వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నోటిఫికేషషన్ వివరాలను పొందవచ్చు.
ఇతర గ్యాలరీలు