నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో 20 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!-notification for a large number of job recruitment in telangana to be released soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో 20 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో 20 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

Published May 17, 2025 01:28 PM IST Basani Shiva Kumar
Published May 17, 2025 01:28 PM IST

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై చాలా రోజులు అవుతోంది. అటు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావించినా.. ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఇటీవల ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చింది. నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి కసరత్తు మొదలైంది. ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో.. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం, నియామక సంస్థలు చర్యలు చేపట్టాయి. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.

(1 / 6)

(unsplash)

2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా.. అప్పటికే ప్రభుత్వం గుర్తించి, పంపించిన ప్రతిపాదనల్లో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్‌ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకుని.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి సవరణ క్యాలెండర్‌ జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు.

(2 / 6)

త్వరలోనే 20 వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్‌ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్‌ జారీ చేసింది. దాని ప్రకారం.. ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి.. టీజీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి.

(3 / 6)

గత జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయనున్న సమయంలో.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేవరకు.. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత సెప్టెంబరు నుంచి షెడ్యూలు ప్రకారం వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి.

(4 / 6)

ఏప్రిల్‌ 14న వర్గీకరణ అమల్లోకి రావడంతో.. ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ఆయా విభాగాలకు లేఖలు రాసింది. దీంతో ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి.

(5 / 6)

జాబ్‌క్యాలెండర్‌లో వివరించిన కేటగిరీల వారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీసు, విద్యుత్తు, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్‌లాగ్‌గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రూప్స్‌తోపాటు.. ఇంజినీరింగ్, గురుకుల, టీచర్‌ ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10 వేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా.

(6 / 6)

ఇతర గ్యాలరీలు