AP TG Weather Updates : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్...! ఏపీకి ఐఎండీ చల్లని కబురు - రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు..!-north coast of andhrapradesh is likely to receive light rain today and tomorrow imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్...! ఏపీకి ఐఎండీ చల్లని కబురు - రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు..!

AP TG Weather Updates : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్...! ఏపీకి ఐఎండీ చల్లని కబురు - రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు..!

Published Feb 19, 2025 03:29 PM IST Maheshwaram Mahendra Chary
Published Feb 19, 2025 03:29 PM IST

  • AP Telangana Weather Updates : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 22వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.  
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు తాజా బులెటిన్ ను విడుదల చేసింది. 

(1 / 7)

ఉపరితల ద్రోణి ప్రభావం నేపథ్యంలో…. ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. 

(2 / 7)

వెదర్ రిపోర్ట్ ప్రకారం... ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

(3 / 7)

(image source unsplash.com)

దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి చూస్తే... పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 

(4 / 7)

రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. 

(5 / 7)

ఇక తెలంగాణలో చూస్తే ఫిబ్రవరి 21వ తేదీ వరకు పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజులపాటు… గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని పేర్కొంది.  

(6 / 7)

ఇక తెలంగాణలో చూస్తే ఫిబ్రవరి 21వ తేదీ వరకు పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజులపాటు… గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని పేర్కొంది. 
 
(image source unsplash.com)

ఫిబ్రవరి 22వ తేదీన తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.  ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణమే ఉండనుంది. 

(7 / 7)

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు