Govt Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్యమైన వివరాలివే-nmdc hyderabad recruitment 2024 notification for junior officer jobs full details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Govt Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్యమైన వివరాలివే

Govt Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్యమైన వివరాలివే

Oct 22, 2024, 05:00 AM IST Maheshwaram Mahendra Chary
Oct 22, 2024, 05:00 AM , IST

  • NMDC Hyderabad Recruitment 2024: పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 153 జూనియర్ ఆఫీసర్(ట్రైనీ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి

హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ(National Mineral Development Corporation) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 153 ఖాళీలు ఉన్నాయి.

(1 / 7)

మొత్తం 10 విభాగాల్లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మైనింగ్ విభాగంలో 56 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 44 ఉద్యోగాలున్నాయి.

(2 / 7)

ఇక మెకానికల్ విభాగంలో 20 పోస్టులు ఉండగా,… కమర్షియల్ 4. సర్వే-9; కెమికల్- 4; సివిల్- 9; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఒక ఖాళీ ఉండగా… జియో అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో మరో 3 జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

(3 / 7)

పోస్టులను అనుసరించి అర్హతలను పేర్కొన్నారు. https://www.nmdc.co.in/careers వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తిస్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు. ఆయా విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ,  పీజీ ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా పని అనుభవం కూడా  ఉండాలి. మొదటగా ట్రైనీ పిరియడ్ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. 18 నెలలపాటు ట్రైనీ పిరియడ్ పూర్తి చేసుకున్న తర్వాత.. పూర్తి పే స్కేల్ ను వర్తింపజేస్తారు.  నెలకు జీతం రూ.37,000 నుంచి రూ.1,30,000గా ఉంటుందని నోటిఫికేషన్ లో వివరించారు. 

(4 / 7)

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. కేటగిరీలవారీగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.  కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇక Supervisory Skill Test కూడా ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.  ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా నియామక పత్రాలను అందజేస్తారు.

(5 / 7)

ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 10, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఆప్లికేషన్లను స్వీకరిస్తారు. 

(6 / 7)

జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) ఉద్యోగ ఆన్ లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ : https://jobapply.in/NMDC2024JOTRAINEE/Registration.aspx 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు