తెలుగు న్యూస్ / ఫోటో /
Nivetha Pethuraj: ఆ హీరో రూ.50కోట్ల బంగ్లా కొనిచ్చారా? రూమర్లపై స్పందించిన హీరోయిన్ నివేదా పేతురాజ్
Nivetha Pethuraj: హీరోయిన్ నివేదా పేతురాజ్‍కు సినీ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.50కోట్ల విలువైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారని కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై నివేదా స్పందించారు.
(1 / 7)
తమిళనాడు ప్రస్తుత మంత్రి, ఒకప్పుడు తనతో నటించిన ఉదయనిధి స్టాలిన్.. తనకు రూ.50 కోట్ల విలువైన ఇల్లు కొనిచ్చారని వస్తున్న రూమర్లను హీరోయిన్ నివేదా పేతురాజ్ ఖండించారు. అవన్నీ అవాస్తవాలని తెలిపారు.
(3 / 7)
సోషల్ మీడియాలో పాపులర్ అయిన సవుక్కు శంకర్ అనే వ్యక్తి ఇటీవల నివేదాపై తన యూట్యూబ్ ఛానెల్‍లో మాట్లాడారు. నివేదాకు ఉదయనిధి స్టాలిన్ రూ.50కోట్ల విలువైన ఇంటిని దుబాయ్‍లో కొనిచ్చారని ఆరోపించారు. ఈ కామెంట్లు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో నివేద నేడు ఈ విషయంపై ట్వీట్ చేశారు.
(4 / 7)
“తాను ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తున్నానని ఇటీవల కొన్ని తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా మా కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే ముందు ఆలోచించండి” అని నివేదా నేడు ట్వీట్ చేశారు.
(5 / 7)
తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, 16 సంవత్సరాల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రగా ఉన్నానని నివేదా తెలిపారు. తన కుటుంబం ఇరవై ఏళ్లుగా దుబాయ్‍లోనే ఉంటోందని పేర్కొన్నారు.
(6 / 7)
“నా గురించి వచ్చిన రూమర్లన్నీ అవాస్తవాలే. 2002 నుంచి మేం దుబాయ్‍లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. 2013 నుంచి నాకు రేసింగ్ ప్యాషన్‍గా ఉంది” అని నివేదా పేతురాజ్ తెలిపారు.
(7 / 7)
“ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ముందు ధ్రువీకరించుకోవాలని నేను కోరుతున్నా. మా కుటుంబాలను వేదనకు గురి చేయవద్దు” అని నివేదా పేతురాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ విషయంలో లీగల్ చర్యలకు దిగడం లేదు. జర్నలిజంలో ఇంకా మానవత్వం ఉందని నేను నమ్ముతున్నా. నాపై ఇక అపవాదులు వేయరని అనుకుంటున్నా” అని నివేదా పేతురాజ్ పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు