తెలుగు న్యూస్ / ఫోటో /
Nitish Kumar Reddy Record: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారత్ ప్లేయర్
- Nitish Kumar Reddy Record: భారత యంగ్ స్టార్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అద్భుత శతకం చేశాడు. ఈ సెంచరీతో ఓ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Nitish Kumar Reddy Record: భారత యంగ్ స్టార్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అద్భుత శతకం చేశాడు. ఈ సెంచరీతో ఓ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
భారత బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలుగోడి సత్తాచాటాడు. మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. అంతర్జాతీయ కెరీర్లో తన తొలి శతకం చేశాడు. తన తొలి సిరీస్‍లోనే సెంచరీ సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా 176 బంతుల్లో 105 పరుగులు చేశాడు నితీశ్.(AP)
(2 / 5)
బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానంలో వచ్చి నితీశ్ అదరగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఇండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. సుందర్ ఔటైనా నితీశ్ జోరు సాగించాడు. సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఓ హిస్టరీ క్రియేట్ చేశాడు. (AFP)
(3 / 5)
ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చి టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఆసీస్ గడ్డపై టెస్టులో 8వ ప్లేస్‍లో దిగి ఎక్కువ రన్స్ చేసిన రికార్డు ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే (87) పేరిట ఉండేది. సెంచరీ చేసి ఇప్పుడు ఆ రికార్డును నితీశ్ బద్దలుకొట్టాడు.(AFP)
(4 / 5)
ఆస్ట్రేలియాలో తక్కువ వయసులో తొలి సెంచరీ చేసిన భారత బ్యాటర్ల జాబితాలో నితీశ్ మూడో స్థానంలో నిలిచాడు. 1992లో సచిన్ 18 సంవత్సరాల 256 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. 2019లో 21 ఏళ్ల 92 రోజుల వయసులో రిషబ్ పంత్.. ఆసీస్ గడ్డపై శతకం బాదాడు. ఇప్పుడు నితీశ్ కుమార్ 21 ఏళ్ల 216 రోజుల వయసులో తన తొలి శతకాన్ని ఆస్ట్రేలియాలో సాధించాడు. దీంతో ఈ జాబితాలో మూడో ప్లేస్‍లో నిలిచాడు.(AP)
ఇతర గ్యాలరీలు