Nissan X-Trail Relaunch । అప్పటి నిస్సాన్ కారు, ఇప్పుడు మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది!
- వాహన తయారీదారు నిస్సాన్ మోటార్.. 2005లో భారతదేశంలో Nissan X-Trail కారును లాంచ్ చేసి, ఆ తర్వాత తొమ్మిదేళ్లకే దానిని డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు మళ్లీ సరికొత్త అవతారంలో పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతోంది.
- వాహన తయారీదారు నిస్సాన్ మోటార్.. 2005లో భారతదేశంలో Nissan X-Trail కారును లాంచ్ చేసి, ఆ తర్వాత తొమ్మిదేళ్లకే దానిని డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు మళ్లీ సరికొత్త అవతారంలో పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతోంది.
(1 / 7)
నిస్సాన్ మోటార్ మళ్లీ తమ మిడ్- రేంజ్ SUV Nissan X-Trailను భారతదేశంలోకి తిరిగి తీసుకురానున్నట్లు ధృవీకరించింది. అయితే నిస్సాన్ ఇంకా దీని లాంచ్ డేట్ ప్రకటించలేదు.
(2 / 7)
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUV, అలయన్స్ CMF-C ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అదనంగా నిస్సాన్ ePOWER డ్రైవ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.
(3 / 7)
ఎక్స్-ట్రైల్‌ను తేలికపాటి వేరియంట్‌లో కూడా అందించాలని నిస్సాన్ ప్లాన్ చేసింది. ఈ లైట్ వేరియంట్ 160 బిహెచ్‌పి శక్తిని, 300 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.
(4 / 7)
నిస్సాన్ మొదటిసారిగా X-ట్రైల్ SUVని 2001లో విడుదల చేసింది, అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ 70 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలను సాధించింది.
(5 / 7)
నిస్సాన్ భారతదేశంలో X-ట్రైల్ SUVని 2005లో విడుదల చేసింది, కానీ తొమ్మిదేళ్ల తర్వాత ఉత్పత్తిని నిలిపివేసింది.
(6 / 7)
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ క్యాబిన్ భాగం, నాణ్యమైన ప్రమాణాలతో కూడిన నావిగేషన్, వినోదం, ట్రాఫిక్ లేదా వాహన సమాచారాన్ని అందించే ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ 12.3-అంగుళాల హై-డెఫినిషన్ డిస్ప్లే, మల్టీ-ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌తో కూడా వస్తుంది. స్టీరింగ్ వీల్‌లో టచ్ డయల్ స్విచ్ ద్వారా వీటిని నియంత్రించవచ్చు.
ఇతర గ్యాలరీలు