(1 / 7)
నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేయడంలో హిందూమతంలో విశేష ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు ఆచరించే ఈ ఉపవాసం విష్ణువుకు, లక్ష్మీదేవికి అంకితం చేశారు. ఈ ఏడాది జూన్ 18న ఈ నిర్జల ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించుకుంటారు.
(2 / 7)
నిర్జల ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. హిందూ పురాణాల ప్రకారం, నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల 24 ఏకాదశులు చేసిన సమానమైన ఫలితాలు లభిస్తాయి.
(3 / 7)
ఈ ఏకాదశినా పూజ చేయడం వల్ల కీర్తి, గౌరవం, సంతోషం పెరుగుతాయి. ఈ ఏకాదశిని ఆచరించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతాడు.
(4 / 7)
ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశికి పూజ ఎలా చేయాలో తెలుసుకోండి.
(5 / 7)
నిర్జల ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసిమంజరి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నం అవుతాడని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. తులసి మంజరి అంటే ఫోటోలో చూపించిన తులసి విత్తనాలు ఉండే భాగం.
(Freepik)(6 / 7)
నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో విష్ణువుకు తులసి ఆకులను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు, అలా చేయడం వల్ల భక్తుడు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది.
(7 / 7)
మీరు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నిర్జల ఏకాదశి రోజు బెల్లంతో చేసిన పాయసం విష్ణువుకు, లక్ష్మీ మాతకు సమర్పించాలి. వారు సంతోష పడతారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి సకల సమస్యల నుండి విముక్తి పొందుతాడు.
ఇతర గ్యాలరీలు