ఒకటి కాదు 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చేసిన ఎమోషనల్ క్రైమ్ డ్రామా.. 6 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?-niram marum ulagil ott streaming on 2 platforms sun nxt amazon prime by 6 rating niram marum ulagil ott release today ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఒకటి కాదు 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చేసిన ఎమోషనల్ క్రైమ్ డ్రామా.. 6 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

ఒకటి కాదు 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చేసిన ఎమోషనల్ క్రైమ్ డ్రామా.. 6 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Published Apr 25, 2025 11:01 AM IST Sanjiv Kumar
Published Apr 25, 2025 11:01 AM IST

రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఇవాళ ఎమోషన్ క్రైమ్ డ్రామా సినిమా నిరమ్ మారుమ్ ఉలగిల్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు 6 ఐఎమ్‌డీబీ రేటింగ్ సంపాదించుకుంది. మరి నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇక్కడ తెలుసుకుందాం.

తమిళంలో ఎమోషనల్, క్రైమ్ డ్రామా సినిమాగా తెరకెక్కిన మూవీ నిరమ్ మారుమ్ ఉలగిల్. దీనర్థం రంగులు మారుతున్న ప్రపంచం అని వస్తుంది. నలుగురి జీవితాలకు సంబంధించిన కథలతో ఎమోషనల్‌గా తెరెక్కిన సినిమా ఇది.

(1 / 7)

నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాతో బ్రిట్టో జేబీ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఈ సినిమాకు కథ ఆయనే రాసుకున్నారు. కుటుంబం సంబంధాలు, తల్లిదండ్రులను విడిచిపెట్టిన కొడుకులు, భార్యాభర్తలు విడిపోవడం, గ్యాంగ్‌స్టర్ క్రైమ్ వంటి వివిధ అంశాలతో ఈ మూవీని చిత్రీకరించారు.

(2 / 7)

నిరమ్ మారుమ్ ఉలగిల్ మూవీలో దర్శకదిగ్గజం భారతీ రాజా ప్రధాన పాత్ర పోషించగా.. రియో రాజ్, యోగి బాబు, నట్టి సుబ్రమణ్యం, వడివుక్కరసి, కనిహా, మైమ్ గోపీ, ఆర్య కృష్ణన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

(3 / 7)

మార్చి 7న థియేటర్లలో విడుదలైన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6 రేటింగ్ కూడా సాధించుకుంది.

(4 / 7)

ఇలాంటి నిరమ్ మారుమ్ ఉలగిల్ ఇవాళ (ఏప్రిల్ 25) ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఒకటి కాదు రెండు ఓటీటీల్లో నిరమ్ మారుమ్ ఉలగిల్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

(5 / 7)

సన్ ఎన్ఎక్స్‌టీతోపాటు అమెజాన్ ప్రైమ్‌లో నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం తమిళ భాషలోనే ఈ రెండు ఓటీటీల్లో నిరమ్ మారుమ్ ఉలగిల్ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.

(6 / 7)

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాను సిగ్నేచర్ ప్రొడక్షన్స్, జీఎస్ సినిమాస్ ఇంటర్నేషనల్ పతాకాలపై నిర్మించారు. దేవ్ ప్రకాష్ రేగన్ సంగీతం అందించారు.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు