(1 / 5)
న్యూజిలాండ్ మరోసారి అదరగొట్టింది. ఆదివారం (మార్చి 23) నాలుగో టీ20లో కివీస్ 115 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుచేసింది. మరో మ్యాచ్ ఉండగానే 5 టీ20ల సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది.
(AFP)(2 / 5)
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫిన్ అలెన్ (50) హాఫ్ సెంచరీ కొట్టాడు. సీఫర్ట్ (44), బ్రాస్ వెల్ (46 నాటౌట్) కూడా రాణించారు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.
(AFP)(3 / 5)
ఛేజింగ్ లో కివీస్ పేసర్ జేకబ్ డఫ్పీ.. పాకిస్థాన్ పని పట్టాడు. నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో పాక్ 16.2 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. జకారీ ఫోల్క్స్ 3 వికెట్లు తీసుకున్నాడు.
(AFP)(4 / 5)
పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తీరు మారడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో శుభ్ మన్ ను ఔట్ చేసిన తర్వాత అబ్రార్ సెండాఫ్ ఇచ్చిన తీరుతో విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్ లో పాక్ చిత్తుగా ఓడింది. అయినా న్యూజిలాండ్ తో నాలుగో టీ20లో బ్రాస్ వెల్ తో అబ్రార్ మాటల యుద్ధానికి దిగడం చర్చనీయాంశంగా మారింది.
(AFP)ఇతర గ్యాలరీలు