ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, పంపిణీపై కసరత్తు - మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి-new ration cards to be distributed in andhrapradesh in next month key details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, పంపిణీపై కసరత్తు - మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, పంపిణీపై కసరత్తు - మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Published Jul 06, 2025 09:31 AM IST Maheshwaram Mahendra Chary
Published Jul 06, 2025 09:31 AM IST

ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఆగస్టు నెలలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను అందజేయనున్నారు.

ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఆగస్టు నెలలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.

(1 / 8)

అయితే ఏపీ సర్కార్ అందజేసే కొత్త రేషన్ కార్డులపై నేతల ఫోటోలు లేకుండా ఉంటాయి. కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

(2 / 8)

ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డు ఉంటుంది. కార్డుకు ఒక వైపుప్రభుత్వ  చిహ్నం ఉంటుంది. మరోవైపు మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబర్ తదితర వివరాలుంటాయి.

(3 / 8)

ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డు ఉంటుంది. కార్డుకు ఒక వైపు

ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. మరోవైపు మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబర్ తదితర వివరాలుంటాయి.

స్మార్ట్ కార్డుతో పలు ప్రయోజనాలు ఉంటాయి. ఈ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి. రేషన్‌ సరుకుల వినియోగానికి సంబంధించిన సమాచారం కూడా కనిపిస్తుంది.

(4 / 8)

ఈ కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత అంటే… ఆగస్ట్ నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది.

(5 / 8)

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం 1,47,187 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 89,864 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. కుటుంబ విభజన (స్ప్లిట్‌) కార్డుల కోసం 1,43,745 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,09,787 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. కొత్తగా వచ్చిన కార్డులతో రాష్ట్రంలో మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 1.48 కోట్లకు చేరింది.

(6 / 8)

కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన స్టేటస్ వివరాలను తెలుసుకోవచ్చు. ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/  లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్ లో స్టేటస్ చూపిస్తుంది. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలియజేస్తారు.

(7 / 8)

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే మొత్తం రేషన్ కార్డులకు సంబంధించి 7 సర్వీసుల్లో మార్పు చేర్పులు చేస్తున్నారు.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు