తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : లక్నవరంలో మూడో 'ఐల్యాండ్' - విశేషాలివే
- లక్నవరం జలాశయంలో కొత్త ఐల్యాండ్ వచ్చేసింది. ప్రకృతి అందాలతో చూపరులను కట్టిపడేలా దీన్ని ఏర్పాటు చేసింది. రూ. 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. 21 కాటేజీలతో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఐల్యాండ్ నవంబర్ 20 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి విశేషాలెంటో ఇక్కడ తెలుసుకోండి….

(1 / 7)
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో మూడో ద్వీపాన్ని (ఐలాండ్) టూరిజం మంత్రి జూపల్లి ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
(2 / 7)
మొత్తం రూ. 7 కోట్ల వ్యయంతో 8 ఎకరాల విస్తీర్ణంలో టీఎస్టీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో మూడో ద్వీపాన్ని (ఐలాండ్ ) అభివృద్ధి చేశారు.
(3 / 7)
లక్నవరం ఐలాండ్ లో పర్యాటకుల ఆహ్వాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యాననవనాలు ఉన్నాయి. మొత్తం 21 కాటేజీలు ఉన్నాయి. ఈ 21కాటేజీల్లో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వచ్చే వారికి ఇవ్వనున్నారు.
(4 / 7)
ఈ ద్వీపంలో ఐదు ఈత కొలనులు ఉండగా వాటిలో నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు.
(5 / 7)
పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి.పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు తదితర వసతులు కల్పించారు.
(6 / 7)
ద్వీపాల అనుభూతిని పొందేందుకు పర్యాటకుల కోసం మంచి ఏర్పాట్లు చేసినట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. లక్నవరం జలాశయంలోని మూడోద్వీపం మాల్దీవులు, మున్నార్, సిమ్లా, అండమాన్ దీవులను తలపిస్తుందని చెప్పారు.
ఇతర గ్యాలరీలు