AP AarogyaSri : ఏపీ ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆసుపత్రుల చర్చలు సఫలం, యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు-network hospitals discussion with ap govt on aarogyasri success services as usual ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Aarogyasri : ఏపీ ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆసుపత్రుల చర్చలు సఫలం, యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

AP AarogyaSri : ఏపీ ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆసుపత్రుల చర్చలు సఫలం, యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

Aug 17, 2024, 06:57 PM IST Bandaru Satyaprasad
Aug 17, 2024, 06:57 PM , IST

  • AP AarogyaSri : ఏపీలోని నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు(ఆరోగ్య శ్రీ సేవలు) యథావిధిగా కొనసాగుతాయని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యపై మంత్రి సానుకూలంగా స్పందించారని నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది.

ఏపీలోని నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు(ఆరోగ్య శ్రీ సేవలు) యథావిధిగా కొనసాగుతాయని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. 

(1 / 6)

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌తో ఏపీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం నేతలు శనివారం చర్చలు జరిపారు. తమ సమస్యపై మంత్రి సానుకూలంగా స్పందించారని నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు విజయ్‌ కుమార్ తెలిపారు. 

(2 / 6)

సోమవారం పెండింగ్‌ బకాయిలు రూ.500 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది. వచ్చే నెలాఖరు నాటికి మరో రూ.250 కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరామని చెప్పింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు.   

(3 / 6)

కోల్ కతా ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రుల్లో సురక్షిత పనివాతావరణం ఉండేలా చర్యలు చేపట్టింది. 

(4 / 6)

వైద్యారోగ్య శాఖ, హోంశాఖ కలిసి పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, సిబ్బంది భద్రతపై మంత్రులు అనిత , సత్యకుమార్ చర్చలు జరిపారు. 

(5 / 6)

ఆసుపత్రుల ఔట్ పోస్టుల వద్ద పోలీస్ భద్రత పెంచాలని మంత్రి సత్యకుమార్ హోంమంత్రిని కోరారు. ఆసుపత్రుల్లో భద్రత పర్యవేక్షకు సీసీ కెమెరాల ఏర్పాటుకు హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.   

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు