(1 / 11)
నెట్‌ఫ్లిక్స్ లోకి ఈవారం కొన్ని ఆసక్తికరమైన సినిమాలు వస్తున్నాయి. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ జానర్లలో మూవీస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి అవేంటో తెలుసుకోండి.
(2 / 11)
ఎటాక్ ఆన్ లండన్ - హంటింగ్ ది 7/7 బాంబర్స్ - వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలనుకుంటే మంగళవారం (జులై 1) నెట్‌ఫ్లిక్స్ లో 'ఎటాక్ ఆన్ లండన్ - హంటింగ్ ది 7/7 బాంబర్స్' విడుదలవుతోంది. లండన్ బాంబు దాడుల కథను చెప్పే ఈ డాక్యుమెంటరీలో మునుపెన్నడూ చూడని విజువల్స్ ను చూపించనున్నారు.
(3 / 11)
ది డీర్ హంటర్ - పెన్సిల్వేనియాలోని ఒక పట్టణంలోని కొందరు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. వియత్నాం యుద్ద సమయంలో జరిగే స్టోరీ ఇది. వీళ్లు ఆ సమయంలో ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
(4 / 11)
ఫ్యామిలీతో కూర్చొని సరదాగా ఏదైనా చూడాలనుకుంటే మంగళవారం (జులై 1) నెట్‌ఫ్లిక్స్ లో 'హియర్ కమ్స్ ది బూమ్' విడుదలవుతోంది. ఈ కథ ఒక బయాలజీ టీచర్ గురించి, అతని లక్ష్యం కొంచెం వింతగా ఉంటుంది. బడ్జెట్ కోతల కారణంగా స్కూల్లో మ్యూజిక్ ప్రోగ్రామ్ రద్దు చేసినప్పుడు ఆ టీచర్ డబ్బు కోసం ఎంఎంఏ రింగులోకి దిగుతాడు.
(5 / 11)
హిట్‌మ్యాన్స్ వైఫ్స్ బాడీగార్డ్ - యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారి కోసం ఈ సినిమా వస్తోంది. మంగళవారం (జులై 1) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
(6 / 11)
ది కరాటే కిడ్ - 'ది కరాటే కిడ్' సినిమా ఫ్రాంఛైజీ లవర్స్ కు గుడ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ మంగళవారం (జులై 1) ఒకేసారి కరాటే కిడ్, ది కరాటే కిడ్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా చూడొచ్చు.
(7 / 11)
మిషన్ ఇంపాజిబుల్ - నెట్ ఫ్లిక్స్ టామ్ క్రూజ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సిరీస్ లోని పలు సినిమాలు ఈ నెల నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో మిషన్ ఇంపాజిబుల్ - రోగ్ నేషన్, మిషన్ ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్, మిషన్ ఇంపాజిబుల్, మిషన్ ఇంపాజిబుల్ 2, మిషన్ ఇంపాజిబుల్ 3 ఉన్నాయి.
(8 / 11)
పసిఫిక్ రిమ్ - సముద్ర జీవులు దేశాలపై దాడి చేయడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది. దీనిని మంగళవారం (జులై 1) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
(9 / 11)
ఎల్లో జాకెట్స్ - సూపర్ హిట్ అయిన 'ఎల్లో జాకెట్స్' వెబ్ సిరీస్ ఇప్పుడు మళ్లీ వచ్చింది. అడవిలో ప్లేన్ కూలిపోయిన తర్వాత తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ అమ్మాయి, ఆమె సాకర్ టీం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా చెప్పే సిరీస్ ఇది.
(10 / 11)
జాతురా - స్పేస్ అడ్వెంచర్ (Zathura - Space Adventure) - జుమాంజీ తరహాలోనే ఈ సినిమాకు కూడా తనదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు పిల్లలు ఒక వింత ఆటను కనుగొని, వారిని అంతరిక్షంలోకి పంపడం గురించిన కథ. మంగళవారం (జులై 1) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది.
(11 / 11)
ఇతర గ్యాలరీలు