(1 / 5)
దో పత్తీ చిత్రం ఈ శుక్రవారం అక్టోబర్ 25వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నేరుగా స్ట్రీమింగ్కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రలు పోషించగా.. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది.
(2 / 5)
హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డోంట్ మూవ్’ కూడా అక్టోబర్ 25వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నేరుగా స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఆడమ్ షిండ్లర్, బ్రియాన్ నీటో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేల్సే అస్బిలే, ఫిన్ విట్రోక్ లీడ్ రోల్స్ చేశారు.
(3 / 5)
తమిళ మూవీ మేయళగన్ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అక్టోబర్ 25వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సత్యం సుందరం కూడా స్ట్రీమింగ్కు వస్తుంది. సెప్టెంబర్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మేయళగన్ మూవీలో తమిళ స్టార్లు కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు.
(4 / 5)
అడ్వెంచర్ ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘ఫ్యామిలీ ప్యాక్’ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నేడు (అక్టోబర్ 23) నేరుగా స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఈ ఫ్రెంచ్ చిత్రం తెలుగు, ఇంగ్లిష్, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
(5 / 5)
‘హైజాక్ 93’ సినిమా నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 25వ తేదీన స్ట్రీమింగ్కు వస్తుంది. 1993లో జరిగిన నైజీరియన్ ఎయిర్వేస్ విమానం హైజాక్ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ హిస్టారికల్ డ్రామా చిత్రానికి చార్లెస్ ఓప్కలేక్ దర్శకత్వం వహించారు.
ఇతర గ్యాలరీలు