(1 / 5)
రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 3న సింగిల్ షిఫ్ట్‌లో నీట్ పీజీ 2025 పరీక్ష జరగనుంది. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష జరుగుతున్నందున అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాలు, నగరాల సంఖ్యను అధికారులు పెంచనున్నారు.
(2 / 5)
ఫలితంగా అభ్యర్థులు తమ ఎగ్జామ్ సిటీల ఛాయిస్‌ని రీ- సబ్మీట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అబ్లికేషన్ ఫామ్ జూన్ 13 నుంచి జూన్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. అనంతరం నగరం వివరాలను అడ్మిట్ కార్డులో వెల్లడిస్తారు.
(HT_PRINT)(3 / 5)
జూన్ 20న నీట్ పీజీ 2025 ఎడిట్ విండో అందుబాటులో ఉంటుంది. జూన్ 22న మూతపడుతుంది. జులై 21న ఎగ్జామ సిటీ వివరాలను ప్రకటిస్తారు. జులై 31న అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయి.
(4 / 5)
నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్ 3న ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఫలితాలను సెప్టెంబర్ 3న ప్రకటిస్తారు.
(5 / 5)
ఎంబీబీఎస్ అనంతరం వైద్య విద్యార్థులు రాసే పరీక్ష ఈ నీట్ పీజీ. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదొకటి. ప్రతియేటా లక్షల్లో విద్యార్థులు నీట్ రాస్తుంటారు.
ఇతర గ్యాలరీలు