Neeraj Chopra: టెన్నిస్ ప్లేయర్‌ను పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా, ఆమె ఎవరంటే
Neeraj Chopra: ఒలింపిక్ స్టార్ నీరజ్ చోప్రా పెళ్లి వైభవంగా జరిగిపోయింది. అతను హిమానీ మోర్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎవరో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నాడు. హిమానీ కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ అని తెలిసింది.
(1 / 5)
ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా సైలెంట్ గా వివామం చేసుకున్నారు. కేవలం 50 నుంచి 60 మంది కుటుంబ సభ్యుల మధ్యే పెళ్లి చేసుకున్నారు. నీరజ్ తన భార్య హిమానీతో కలిసి హనీమూన్ కు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
(2 / 5)
నీరజ్ చేసుకున్న హిమానీ ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్లి చూపిస్తున్నారు. హిమానీ వయసు 25 ఏళ్లు. ఆమె సోనిపట్ కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం అమెరికాలో స్పోర్ట్స్ మెనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.
(3 / 5)
హిమానీ మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా. 2016, 2017లో తైపీ, మలేషియాలో జరిగిన పోటీల్లో పాల్గొంది. జూనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో ఆమె బంగారు పతకాన్ని కూడా సాధించినట్టు ఆమె చదివిన స్కూల్ వెబ్ సైట్లో ఉంది.
(@Neeraj_chopra1)(4 / 5)
నీరజ్ చోప్రా ఆదివారం తన సోషల్ ఖాతాలో పెళ్లి విషయాన్ని ప్రకటించారు. పెళ్లి జరిగి రెండు మూడు రోజులు గడిచినట్టు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు