(1 / 5)
మాతృ దినోత్సవాన్ని నేడు (మే 11) తన ఇద్దరు కవల కుమారులు ఉయిర్, ఉలగ్‍తో సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నారు స్టార్ హీరోయిన్ నయనతార. ఆనందంగా వారితో సమయం గడిపారు. ఈ ఫొటోలను నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
(2 / 5)
నయనతార, విఘ్నేష్ కుమారులు ఇద్దరూ లైట్ బ్లూ కుర్తా, తెలుపు పైజామా ధరించి క్యూట్‍గా ఉన్నారు. ఇద్దరు పిల్లలు నయనతారను కౌగిలించుకున్నారు. గులాబీలను కూడా ఇచ్చి విష్ చేశారు.
(3 / 5)
తన కుమారులను ఎత్తుకొని మురిసిపోయారు నయనతార. ఈ ఫొటోలతో పాటు హృదయాన్ని హత్తుకునేలా నోట్ రాశారు విఘ్నేష్. పనిని, మిగిలిన అన్ని విషయాలను బ్యాలెన్స్ చేస్తున్నావని, నువ్వు బెస్ట్ మామ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
(4 / 5)
“హ్యాపీ మదర్స్ డే నా బంగారం (నయనతార). తల్లివి అయిన తర్వాత నీ ముఖంలో చూసిన ఆనందం నేను అంతకు ముందెప్పుడు చూడలేదు. దేవుడి దయతో ఈ ఆనందం, ఈ స్వచ్ఛమైన నవ్వు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి” అని నోట్ రాశారు. నువ్వు నా స్ఫూర్తి అంటూ విఘ్నేష్ పేర్కొన్నారు. నయనతార లాంటి తల్లి ఉన్నందుకు ఉయిర్, ఉలగ్ ఎంతో అదృష్టవంతులంటూ హృదయాన్ని తాసేలా క్యాప్షన్ పెట్టారు విఘ్నేష్.
(5 / 5)
నయనతార, విఘ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. సరోగసి ద్వారా ఉయిర్, ఉలగ్‍కు జన్మనిచ్చారు.
ఇతర గ్యాలరీలు