Navratri 2022: విందు భోజనం చేయకండి.. మీ ఉపవాసాన్ని ఇలా విరమించండి!-navratri 2022 tips to break your fast in a healthy way ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Navratri 2022 Tips To Break Your Fast In A Healthy Way

Navratri 2022: విందు భోజనం చేయకండి.. మీ ఉపవాసాన్ని ఇలా విరమించండి!

Sep 28, 2022, 05:41 PM IST HT Telugu Desk
Sep 28, 2022, 05:41 PM , IST

  • ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఉపవాసాన్ని విరమించేటపుడు ఆకలి ఎక్కువగా ఉందని పెద్ద మొత్తంలో ఆహారం తినేయకూడదు. తాజా పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సలాడ్ లేదా చక్కెర లేని జ్యూస్ వంటి సాధారణమైన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే..

శరన్నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు ఉపవాసాలు ఉంటారు. మొదటి సారి ఉపవాసం ఉన్న వారు, మీ ఉపవాసాన్ని ఆరోగ్యకరమైన రీతిలో విరమించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

(1 / 10)

శరన్నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు ఉపవాసాలు ఉంటారు. మొదటి సారి ఉపవాసం ఉన్న వారు, మీ ఉపవాసాన్ని ఆరోగ్యకరమైన రీతిలో విరమించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.(File Image (iStock))

50% జ్యూస్, 50% నీరు కలిగిన పండ్లు/కూరగాయల రసంతో మీ ఉపవాసాన్ని విరమించండి. చిక్కటి జ్యూస్ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

(2 / 10)

50% జ్యూస్, 50% నీరు కలిగిన పండ్లు/కూరగాయల రసంతో మీ ఉపవాసాన్ని విరమించండి. చిక్కటి జ్యూస్ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.(File Image (Pixabay))

ఉపవాసం విరమించిన తర్వాత కూడా ఒక వారం పాటు చక్కెర, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు.

(3 / 10)

ఉపవాసం విరమించిన తర్వాత కూడా ఒక వారం పాటు చక్కెర, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు.(Unsplash)

ఒకవేళ మీరు ఉపవాస సమయంలో ఎక్కువ పండ్లు తింటే, మీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సలాడ్‌ను తీసుకోవాలి.

(4 / 10)

ఒకవేళ మీరు ఉపవాస సమయంలో ఎక్కువ పండ్లు తింటే, మీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సలాడ్‌ను తీసుకోవాలి.(Unsplash)

ఉపవాసం విరమించిన వెంటనే భారీగా భోజనం చేసేయకూడదు. ప్రతి రెండు లేదా మూడు గంటలకు కొంచెం కొంచెం తినండి.

(5 / 10)

ఉపవాసం విరమించిన వెంటనే భారీగా భోజనం చేసేయకూడదు. ప్రతి రెండు లేదా మూడు గంటలకు కొంచెం కొంచెం తినండి.(Unsplash)

ఉపవాసం విరమించిన తర్వాత మీ డైట్‌లో కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ , చిక్కుళ్ళు వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్‌లను ఎక్కువగా తీసుకోండి.

(6 / 10)

ఉపవాసం విరమించిన తర్వాత మీ డైట్‌లో కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ , చిక్కుళ్ళు వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్‌లను ఎక్కువగా తీసుకోండి.(Unsplash)

ఉపవాసం విరమించేటపుడు ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండేవి, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోండి.

(7 / 10)

ఉపవాసం విరమించేటపుడు ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండేవి, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోండి.(Pixabay)

ముందుగా మీ శరీరం పైన పేర్కొన్నటువంటి సాధారణ ఆహారాలకు అలవాటుపడిన తర్వాత అప్పుడు పాలు, మాంసాహార పదార్థాలు తీసుకోవచ్చు.

(8 / 10)

ముందుగా మీ శరీరం పైన పేర్కొన్నటువంటి సాధారణ ఆహారాలకు అలవాటుపడిన తర్వాత అప్పుడు పాలు, మాంసాహార పదార్థాలు తీసుకోవచ్చు.(Unsplash)

వేయించిన, అధిక కేలరీలలు కలిగిన ఆహారంతో మీ ఉపవాసాన్ని విరమించవద్దు ఎందుకంటే ఇది మీ ప్రేగు కదలికలకు అంతరాయం కలిగించవచ్చు, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. చివరికి మీరు ఉపవాసం ఉండి కూడా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం లేకుండా పోతుంది.

(9 / 10)

వేయించిన, అధిక కేలరీలలు కలిగిన ఆహారంతో మీ ఉపవాసాన్ని విరమించవద్దు ఎందుకంటే ఇది మీ ప్రేగు కదలికలకు అంతరాయం కలిగించవచ్చు, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. చివరికి మీరు ఉపవాసం ఉండి కూడా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం లేకుండా పోతుంది.(Unsplash)

సంబంధిత కథనం

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు