NASA's ‘space tug’: ఐఎస్ఎస్ ను కిందకు తీసుకురానున్న నాసా
NASA's ‘space tug’: అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (International Space Station ISS) అక్కడి నుంచి భూవాతావరణంలోనికి తీసుకువచ్చే బృహత్కార్యాన్ని నాసా (NASA) ప్రారంభించింది. 2030 నాటికి ISS ను పూర్తి నియంత్రణతో భూ వాతావరణంలోనికి తీసుకురావాలని నాసా (NASA) ప్రయత్నిస్తోంది. అందుకోసం ఒక భారీ స్పేస్ టగ్ (space tug) ను కూడా సిద్ధం చేస్తోంది.
(1 / 6)
NASA's ‘space tug’: ఐఎస్ఎస్ (ISS) ను భూ వాతావరణంలోనికి లాక్కురావడం కోసం నాసా ఒక భారీ స్పేస్ టగ్ (Space tug) ను తయారు చేస్తోంది.(NASA)
(2 / 6)
space tug: ఈ స్పేస్ టగ్ ను రూపొందించడానికి అమెరికా ప్రభుత్వానికి సుమారు 1 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అమెరికా ప్రభుత్వం ఇందుకోసం ఇప్పటికే నిధుల విడుదల ప్రారంభించింది.(NASA)
(3 / 6)
The space tug : నిజానికి ఐఎస్ఎస్ ను కక్ష నుంచి తప్పించే ఈ కార్యక్రమంలో అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో పాటు, రష్యా, యూరోప్, కెనెడా, జపాన్ ల స్పేస్ ఏజెన్సీలు కూడా సహకరిస్తున్నాయి.(NASA)
(4 / 6)
ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను పూర్తి నియంత్రణతో భూ వాతావరణంలోకి తీసుకువచ్చే ప్రక్రియలో వాడే రోబోటిక్ స్పేస్ కార్గొ వెహికిల్స్ ను రష్యా సమకూరుస్తోంది.(NASA)
(5 / 6)
ISS: ఐఎస్ఎస్ ను భూ వాతావరణంలోకి తీసుకురావాలన్నది చాన్నాళ్ల క్రితం నుంచి ఉన్న ఆలోచన. భూ గ్రహ కక్ష లో దీన్ని ఏర్పాటు చేయడం వల్ల కమర్షియల్ గా సహాయపడే అంతరిక్ష కార్యక్రమాలు చేపట్టడం సులువవుతుంది.(NASA)
(6 / 6)
NASA: ఐఎస్ఎస్ ను పూర్తి నియంత్రణతో భూ వాతావరణంలోనికి తీసుకురావడం కోసం పూర్తి ప్రణాళికను నాసా సిద్ధం చేసింది. (NASA)
ఇతర గ్యాలరీలు