Nara Family Sankranti : భార్య బ్రహ్మణికి నారా లోకేష్ బహుమతి.. నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- Nara Family Sankranti : ఏపీలోని పల్లె.. పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంది. సంక్రాంతి సందర్భంగా మంత్రి లోకేష్.. తన భార్య బ్రాహ్మణికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ విశేషాలు ఓసారి చూద్దాం.
- Nara Family Sankranti : ఏపీలోని పల్లె.. పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంది. సంక్రాంతి సందర్భంగా మంత్రి లోకేష్.. తన భార్య బ్రాహ్మణికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ విశేషాలు ఓసారి చూద్దాం.
(1 / 7)
సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా తన భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి పండుగ రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
(2 / 7)
మనిషి ఎక్కడ ఉన్నా ఆయన మనసంతా మంగళగిరిలోనే ఉంటుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. సంక్రాంతి అనేది రైతుల పండుగ అని.. పాడిపంటలు ఇంటికొచ్చిన వేళ పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
(3 / 7)
ప్రతీ ఇంటి ముంగిట కళకళలాడే రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. ప్రజలకు సంతోషాన్ని పంచాలని లోకేష్ ఆకాక్షించారు. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. సంబరాల సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నట్టు చెప్పారు.
(4 / 7)
సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో ఆటలపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో లోకేష్ కుమారుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
(5 / 7)
పిల్లల ఆటలపోటీల్లో దేవాన్ష్‌ను చూసి.. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరీ ఆనందం వ్యక్తం చేశారు. తోటి పిల్లలతో దేవాన్ష్ పోటీ పడటాన్ని చూసి మురిసిపోయారు.
(6 / 7)
నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఊర్ల ఈ జంట సందడి చేసింది.
ఇతర గ్యాలరీలు