Lokesh in Kumbh Mela : మహా కుంభమేళాలో నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫొటోలు-nara lokesh family photos at the maha kumbh mela ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lokesh In Kumbh Mela : మహా కుంభమేళాలో నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫొటోలు

Lokesh in Kumbh Mela : మహా కుంభమేళాలో నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫొటోలు

Published Feb 17, 2025 05:46 PM IST Basani Shiva Kumar
Published Feb 17, 2025 05:46 PM IST

  • Lokesh in Kumbh Mela : ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి.. గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇక్కడ ఉన్నాయి.

మంత్రి లోకేష్, బ్రాహ్మణి పితృదేవతలను స్మరించుకుంటూ.. బ్రాహ్మణులకు ప్రయాగ్‌రాజ్‌లో వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. 

(1 / 6)

మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం అని లోకేష్ వ్యాఖ్యానించారు. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక అని అభివర్ణించారు. 

(2 / 6)

మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుందని లోకేష్ చెప్పారు. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం అని వివరించారు. 

(3 / 6)

కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు. మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంత్రి నారా లోకేష్ ఉదయం10 గంటలకు ప్రయాగ రాజ్ బయలుదేరి వెళ్ళారు. 10.10 గంటల నుంచి 12.10 గంటల నడుమ మహాకుంభ మేళా షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

(4 / 6)

మధ్యాహ్నం 1.00 గంటకు  ప్రయాగ్‍రాజ్ నుంచి వారణాసికి పయనమయ్యారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. సాయంత్రం 3.40 గంటలకు వారణాసి కాశీవిశ్వేశ్వర ఆలయ సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

(5 / 6)

సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి ఆలయాన్ని లోకేష్ దంపతులు సందర్శించారు. సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యారు.

(6 / 6)

Basani Shiva Kumar

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు