Nagoba Jatara : నాగోబా జాతరకు వేళాయే.. పంచభూతాల ఆరాధనే ఆచారంగా పూజలు!-nagoba jatara begins in keslapur of adilabad district from january 28 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nagoba Jatara : నాగోబా జాతరకు వేళాయే.. పంచభూతాల ఆరాధనే ఆచారంగా పూజలు!

Nagoba Jatara : నాగోబా జాతరకు వేళాయే.. పంచభూతాల ఆరాధనే ఆచారంగా పూజలు!

Published Jan 03, 2025 10:20 AM IST Basani Shiva Kumar
Published Jan 03, 2025 10:20 AM IST

  • Nagoba Jatara : మన దేశంలో ఆదివాసీల ఆచార వ్యవహారమంతా ప్రకృతితోనే మమేకమై ఉంటుంది. పంచభూతాల ఆరాధనే వారి ఆచారంగా కొనసాగుతోంది. ఆధునిక కాలంలో ఎన్ని మార్పులొచ్చినా.. ఆదివాసీలు మాత్రం వారి తరతరాల ఆచారాలనే నేటికీ కొనసాగిస్తున్నారు. అందుకు సాక్షాత్కారంగా నిలుస్తోంది నాగోబా జాతర.

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటి. జాతర క్రతువులో అడుగడుగునా జరిగే ఆదివాసీ ఆచారవ్యవహారాలు వారి జీవన విధానానికి అద్దం పడతాయి. 

(1 / 6)

మెస్రం వంశీయుల చేతుల మీదుగా జరిగే నాగోబా జాతర.. ఆదివాసీలకే కాదు, ఆదివాసేతరులకు కూడా ప్రత్యేకమే. 400 కంటే తక్కువ మంది గిరిజనులే నివసించే కేస్లాపూర్‌కు.. జాతర సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో మెస్రం వంశీయులు సహా ఇతర రాష్ట్రాల నుంచీ లక్షలాదిమంది తరలివస్తారు. ఈ జాతరను ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించింది. 

(2 / 6)

అతిపెద్ద ఆదివాసీ గిరిజన వేడుకైన కేస్లాపూర్‌ నాగోబా జాతర ఈ నెల 28 అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభం కానుంది. ఆదివాసీ గిరిజన దర్బార్‌ ఈ నెల 31న జరగనుంది. 

(3 / 6)

జాతర సన్నాహక సమావేశాన్ని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ రాజర్షిషా, ఉట్నూరు ఐటీటీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ గౌష్‌ ఆలం, నాగోబాను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లపై చర్చించారు. 

(4 / 6)

ఈసారి రాష్ట్ర, జాతీయ నేతలను జాతరకు ఆహ్వానించాలని నిర్ణయించారు. జాతర పూర్తయ్యే వరకు కేస్లాపూర్‌ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలను నిషేధించనున్నారు. 

(5 / 6)

నెలవంక కనిపించడంతో తొలిఘట్టంగా ఏడు రోజుల పాటు సాగే ప్రచార రథం.. శుక్రవారం కేస్లాపూర్‌లో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం బయలుదేరనుంది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు