(1 / 6)
కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు… ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణంలో చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
(2 / 6)
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ నవంబర్ 2, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు.
(3 / 6)
ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
(4 / 6)
రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే…. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో రావొచ్చు.
(5 / 6)
(6 / 6)
మరోవైపు అక్టోబర్ 26 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం కూడా అందబాటులోకి రానుంది. దీనికి కూడా పైన పేర్కొన్న టికెట్ ధరలే వర్తించనున్నాయి. ఈ జర్నీ దాదాపు 6 నుంచి 7 గంటల వరకు ఉంటుంది.
ఇతర గ్యాలరీలు