Telangana Tourism : సాగర్ గేట్లు ఎత్తారు.. చూసొద్దామా..! రూ. 800కే టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో ఇవన్నీ చూడొచ్చు..!
- కృష్ణమ్మకు మరోసారి వరద ఉద్ధృతి మొదలైంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. సాగర్ ప్రాజెక్ట్ ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800కే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
- కృష్ణమ్మకు మరోసారి వరద ఉద్ధృతి మొదలైంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. సాగర్ ప్రాజెక్ట్ ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800కే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
(1 / 7)
ఎగువ నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ అలల అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు.
(2 / 7)
అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800 టికెట్ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
(3 / 7)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా సాగర్ ప్రాజెక్టుతో పాటు సమీపంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలను చూడొచ్చు. కేవలం వన్ డ్ లోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. అయితే ఈ ప్యాకేజీ వీకెండ్స్ లోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది. అంతకంటే ముందుగానే టూరిస్టులు బుకింగ్ చేసుకోవాలి. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అక్టోబర్ 26, 27వ తేదీల్లో అందుబాటులో ఉంది. ఈ వీక్ మిస్ అయితే… నెక్స్ట్ వీక్ లో ప్లాన్ చేసుకోవచ్చు
(4 / 7)
(5 / 7)
(6 / 7)
హైదరాబాద్ - సాగర్ టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 800గా నిర్ణయించారు. ఇక చిన్న పిల్లలకు రూ. 640గా ఉంది.
(7 / 7)
హైదరాబాద్ - సాగర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=23&journeyDate=2024-10-26&adults=2&childs=0
ఇతర గ్యాలరీలు