Mass Re Release Tickets: నాగార్జున ‘మాస్’ సినిమా రీ-రిలీజ్ టికెట్ల బుకింగ్స్ షురూ
- Mass Re-Release Tickets: టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు మాస్ చిత్రం రీ-రిలీజ్ కానుంది. 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నేడు (అక్టోబర్ 26) మొదలయ్యాయి.
- Mass Re-Release Tickets: టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు మాస్ చిత్రం రీ-రిలీజ్ కానుంది. 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నేడు (అక్టోబర్ 26) మొదలయ్యాయి.
(1 / 5)
సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున.. ఆగస్టు 29వ తేదీన తన 65వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అందుకు ఒక్కరోజు ముందు ఆగస్టు 28న బ్లాక్‍బస్టర్ క్లాసిక్ మూవీ ‘మాస్’ రీ-రిలీజ్ కానుంది.
(2 / 5)
సుమారు 20 సంవత్సరాల తర్వాత మాస్ చిత్రం మళ్లీ థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ యాక్షన్ సినిమా రీ-రిలీజ్ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ నేడు (ఆగస్టు 26) షురూ అయ్యాయి. సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
(3 / 5)
2004 డిసెంబర్ 23న థియేటర్లలో మాస్ సినిమా రిలీజ్ అయింది. నాగార్జున కెరీర్లో ఒకానొక బిగ్ హిట్‍గా ఈ చిత్రం నిలిచింది. కల్ట్ మూవీగా నిలిచింది. భారీ కలెక్షన్లు దక్కించుకుంది.ఈ చిత్రంలో మాస్ యాక్షన్ మోడ్‍లో నాగ్ అదరగొట్టారు. యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్వాగ్‍తో కుమ్మేశారు.
(4 / 5)
మాస్ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కొరియోగ్రాఫర్‌గా ఫుల్ ఫామ్‍లో ఉన్న లారెన్స్ ఈ మూవీతోనే డైరెక్టర్‌గా మారారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే ఆయన బ్లాక్‍బస్టర్ కొట్టారు. నాగార్జునకు సూపర్ హిట్ అందించారు.
(5 / 5)
మాస్ సినిమాలో యాక్షన్‍తో పాటు లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్ ఇలా అన్ని అంశాలు బాగా పండాయి. దీంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రంలో జ్యోతిక, చార్మీ హీరోయిన్లుగా నటించారు. సునీల్, రఘువరణ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆగస్టు 28న ఈ చిత్రం 4కే ఫార్మాట్‍లో రీ-రిలీజ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు