తెలుగు న్యూస్ / ఫోటో /
Maha Kumbh Mela: మరో రెండు రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం; భారీగా తరలివస్తున్న భక్తులు, సాధువులు
Maha Kumbh Mela 2025: జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 13న తొలి షాహీస్నానం జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని పూర్తిగా అలంకరించారు. మహాకుంభమేళాకు లక్షలాది మంది సాధువులు వస్తున్నారు.
(1 / 8)
మహాకుంభమేళాకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో నాగ సాధువులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు.కాళీ వేషధారణలో ఉన్న నాగ సాధువు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(2 / 8)
మరో సాధువు రోడ్డుపై కత్తి పట్టుకొని నృత్యం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ ఏడాది కుంభమేళా సుమారు 44 రోజుల పాటు కొనసాగనుంది.
(3 / 8)
ప్రయాగరాజ్ లో కొందరు గుర్రంపై కూర్చొని గదలు, కత్తులు పట్టుకొని కనిపించారు. కుంభమేళాలో పాల్గొనడానికి నాగ సాధువులే కాదు వీఐపీలు కూడా వస్తారు.
(4 / 8)
నాగ సాధువులు చాలా మంది పులి చర్మాలు ధరించి, పూలదండలు వేసుకుని, శరీరమంతా విభూతి పూసి, డప్పులు కొడుతూ మహాకుంభ వేదిక వద్దకు చేరుకుంటున్నారు.
(5 / 8)
బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా కల్పవీలు కూడా మహాకుంభ్ కోసం గుర్రంపై రావడం కనిపించింది.
(7 / 8)
మహాకుంభ సమయంలో గంగ, యమన, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. (AFP)
ఇతర గ్యాలరీలు