తెలుగు న్యూస్ / ఫోటో /
Naga Chaitanya: అభిమాని ఇంటికి వెళ్లిన నాగచైతన్య: ఫొటోలు
- Naga Chaitanya: తండేల్ సినిమా సక్సెస్ టూర్ కోసం విజయవాడకు వెళ్లారు హీరో అక్కినేని నాగచైతన్య. ఈ సందర్భంగా ఓ అభిమాని ఇంటికి కూడా వెళ్లారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Naga Chaitanya: తండేల్ సినిమా సక్సెస్ టూర్ కోసం విజయవాడకు వెళ్లారు హీరో అక్కినేని నాగచైతన్య. ఈ సందర్భంగా ఓ అభిమాని ఇంటికి కూడా వెళ్లారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ తరుణంలో సక్సెస్ టూర్ కోసం విజయవాడకు నేడు (ఫిబ్రవరి 9) వెళ్లింది మూవీ టీమ్. ఈ సందర్భంగా తన తండ్రి నాగార్జునకు వీరాభిమాని అయిన వ్యక్తి ఇంటికి వెళ్లారు చైతన్య.
(2 / 5)
విజయవాడలోని ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షుడు సర్వేశ్వర రావు ఇంటికి నాగచైతన్య వెళ్లారు. సర్వేశ్వర రావుకు అనారోగ్యంగా ఉండటంతో పరామర్శించారు.
(3 / 5)
సర్వేశ్వర రావుతో.. వారి కుటుంబ సభ్యులతో నాగచైతన్య మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
(4 / 5)
అక్కినేని అభిమాని ఇంటికి నాగచైతన్య వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతూను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు