
(1 / 5)
Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందంటూ రెండేళ్లుగా వస్తున్న వార్తలకు ఇక తెరపడింది. తమ మధ్య ఉన్నది ప్రేమే అంటూ ఈ ఇద్దరూ ఏకంగా నిశ్చితార్థం ఫొటోలతోనే సర్‌ప్రైజ్ చేశారు.

(2 / 5)
Naga Chaitanya Sobhita: గురువారం (ఆగస్ట్ 8) ఉదయం 9.42 గంటలకు వీళ్ల నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జుననే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక రోజు ముందు నుంచే వార్తలు వస్తున్నా.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం దీనిపై స్పందించలేదు. చివరికి ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యాక ఫొటోలు రిలీజ్ చేయడం విశేషం. దీంతో చైతన్య జీవితంలో సమంత ఛాప్టర్ పూర్తిగా క్లోజ్ అయిపోయి శోభితతో కొత్త జీవితం మొదలు కానుంది.

(3 / 5)
Naga Chaitanya Sobhita: సమంతతో విడాకుల తర్వాత చైతన్య నటి శోభితతో డేటింగ్ చేస్తున్నట్లు రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ తొలిసారి మే, 2022లో కలిశారు. తర్వాత అప్పుడప్పుడూ లండన్ వీధుల్లో, యూరప్ ట్రిప్ లో కనిపిస్తూ తమ మధ్య ఏదో నడుస్తోందని చెప్పకనే చెప్పారు.

(4 / 5)
Naga Chaitanya Sobhita: ఆ మధ్య యూరప్ ట్రిప్ లో ఓ వైన్ యార్డ్ లో ఈ ఇద్దరూ వైన్ టేస్ట్ చేస్తున్న ఈ ఫొటో కూడా బయటకు వచ్చింది. అయినా వీళ్లు మాత్రం తమ రిలేషన్షిప్ పై నోరు మెదపలేదు. నిశ్చితార్థం వరకూ తమ బంధాన్ని సీక్రెట్ గానే ఉంచారు.

(5 / 5)
Naga Chaitanya Sobhita: చై, శోభిత తమ రిలేషన్షిప్ ను బయట పెట్టకపోయినా.. తరచూ ఇలాంటి ఫొటోలతో దొరికిపోయే వాళ్లు. ఇది కూడా యూరప్ లో ఓ రెస్టారెంట్లో చెఫ్ చైతో ఫొటో దిగగా.. వెనుక శోభిత ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మొత్తానికి తమ రిలేషన్షిప్ ను వీళ్లు మాటలతో బయటపెట్టకపోయినా.. నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారు.
ఇతర గ్యాలరీలు