(1 / 9)
మైసూర్ దసరా ఫుడ్ ఫెయిర్‌కు కర్ణాటక నుండి మాత్రమే కాకుండా రాష్ట్రం వెలుపల నుండి కూడా భోజన ప్రియులు వస్తుంటారు. పాత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో జరిగే ఫుడ్ ఫెయిర్‌లో వందకు పైగా స్టాళ్లు ఉంటాయి. ఇక్కడ ఉత్తర కర్ణాటక రుచి, కోస్తా వంటకాలు, శాఖాహారం మరియు మాంసాహార భోజనాలు లభిస్తాయి. అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం కూడా కావడంతో చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు కూడా ఈసారి ఆహార మేళాలో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
(2 / 9)
మైసూర్ లో దసరా అంటేనే ప్యాలెస్ మ్యూజిక్. ప్రముఖ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తుటారు. ప్యాలెస్ లైట్ల నేపధ్యంలో గ్రాండ్ స్టేజ్ పై, ప్యాలెస్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడం విశేషం. ఈసారి కూడా రాత్రి తొమ్మిది రోజుల పాటు ప్యాలెస్ ప్రాంగణంలో హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, లైట్ మ్యూజిక్, నృత్యం, పోలీస్ బ్యాండ్ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించవచ్చు.
(3 / 9)
మైసూరు మహారాజా కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే యువ దసరా కార్యక్రమం కూడా చూసి తీరాల్సిందే. ఈసారి బయటి రాష్ట్రాల కళాకారులకు బదులు కర్నాటకకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సంచిత్ హెగ్డే అండ్ టీమ్, సాధుకోకిల ప్రోగ్రాం కూడా ఉంటుంది. అక్టోబర్ 18 నుండి 21 వరకు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు యువ దసరా కార్యక్రమం ఉంటుంది.
(4 / 9)
దసరా ఫిల్మ్ ఫెస్టివల్ చాలా ఏళ్లుగా జరుగుతోంది. పాత, కొత్త చిత్రాలతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. హాస్య చక్రవర్తి నరసింహరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఈసారి ఆగస్టు 16 నుంచి 22 వరకు 112 చిత్రాలను మైసూర్‌లోని మాల్ ఐనాక్స్ మాల్, డీఆర్‌సీ, బీఎం హ్యాబిటాట్ మాల్‌లో ప్రదర్శించనున్నారు.
(5 / 9)
దసరా సందర్భంగా నిర్వహించే ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ భారత సైనిక దళానికి చెందిన వివిధ అధునాతన యుద్ధ విమానాల విన్యాసాలను చూడవచ్చు. గత నాలుగేళ్లుగా ఎయిర్ షో నిర్వహించడం లేదు. కానీ, ఈసారి ఎయిర్ షోకు అనుమతి లభించింది. దాంతో మైసూరులోని బన్నిమంటపలోని మైదానంలో ఎయిర్ షో నిర్వహించనున్నారు.
(6 / 9)
దసరా సమయంలో మైసూరులో పురావస్తు శాఖ గత రెండు దశాబ్దాలుగా హెరిటేజ్ వాక్ ను నిర్వహిస్తోంది. ఇరవై నుంచి ముప్పై వారసత్వ కట్టడాల మార్గంలో రెండు గంటల పాటు నడిచి, నిపుణుల నుంచి చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 21, 22 తేదీల్లో మైసూరు ప్యాలెస్ ఎదురుగా చామరాజేంద్ర సర్కిల్ నుంచి హెరిటేజ్ వాక్ ప్రారంభమవుతుంది.
(7 / 9)
ఉద్యానవన శాఖ దశాబ్దాలుగా దసరా సందర్భంగా పండ్లు, పూల ప్రదర్శనలు నిర్వహిస్తోంది. కుప్పన్న పార్కులో ఫల, పుష్ప ప్రదర్శన ఈసారి కూడా పది రోజుల పాటు కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆయా సీజన్ల థీమ్ ఆధారంగా ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. ప్రపంచకప్ క్రికెట్, చంద్రయాన్ సహా పలు అంశాల ఆధారంగా ఈసారి పండ్ల పూల అలంకరణ జరగనుంది. కర్ణాటక ప్రభుత్వ ఐదు హామీలు కూడా ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక్కడ గార్డెనింగ్ మెటీరియల్స్ కూడా కొనుగోలు చేయవచ్చు.
(8 / 9)
దసరా అంటే జంబూ సవారీ. శిక్షణ పొందిన ఏనుగులు మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలో నెలన్నర పాటు ఉండి దసరా ఉత్సవాల్లో పాల్గొంటాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఏనుగులకు శిక్షణ ఇస్తారు. అది కూడా దసరా సమయంలోనే. ఈ సమయంలో ఏనుగుల విన్యాసాలను చూడవచ్చు.
(9 / 9)
మైసూర్ రాచరిక వైభవానికి, సంస్కృతికి చిహ్నంగా ఉండే రాజ దర్బార్ దసరా ఆకర్షణ. దసరా సమయంలో రాజ కుటుంబీకులు బంగారు సింహాసనాలపై కూర్చొని దర్బార్లు నిర్వహిస్తారు, తొలిరోజు రాజభవన ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం తర్వాత తొమ్మిది రోజుల పాటు ప్రైవేట్ దర్బార్ నిర్వహిస్తారు.
ఇతర గ్యాలరీలు