(1 / 5)
రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు రిస్క్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక రిస్క్ ఉండే ఫండ్స్‌లో పెట్టకపోవడం బెటర్. ఈ సమయంలో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అవుతాయి.
(2 / 5)
దేశీయంగా ఉన్న ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీల్లో (నిఫ్టీ50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మొదలైనవి) ఇన్వెస్ట్ చేయడాన్ని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. హిస్టారికల్‌గా చూసుకుంటే ఇవి సగటు 12శాతం రిటర్నులు ఇచ్చాయి.
(3 / 5)
12శాతం రిటర్నులను పరిగణలోకి తీసుకుని, 27ఏళ్ల వయస్సు నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభిస్తే.. 60ఏళ్లు వచ్చేసరికి (అంటే 33ఏళ్ల ఇన్వెస్ట్మెంట్) రూ. 2కోట్ల సంపద కోసం ప్రతి నెల రూ. 4600 పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మొత్తం వాల్యూ రూ. 2,01,09,474 అవుతుంది.
(4 / 5)
అదే 25ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే.. 60ఏళ్లకు ఇంకా 35ఏళ్ల సమయం ఉంటుంది. ఫలితంగా ప్రతి నెలా 3,700 ఇన్వెస్ట్ చేస్తే చాలు 60ఏళ్లకు అది రూ. 2,03,90,075 అవుతుంది.
(5 / 5)
అంటే ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టామని కాదు, ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించామనేది ఇక్కడ ముఖ్యం.
ఇతర గ్యాలరీలు