(1 / 7)
చేపలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారాలు. మాంసాహారాల్లో చేపలు బెస్ట్ ఫుడ్ అంటారు. కొన్ని రకాల చేపలు వ్యాధులకు వ్యతిరేకంగా కూడా పోరాడుతాయి.
(2 / 7)
ఒక రుచికరమైన చేప జాతి కొర్రమీను. ఇది పొడవైన, చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. నదులు, జలాశయాలు, చెరువులలో లభిస్తుంది. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా ఈ రకాలను ప్రత్యేకంగా పెంచుతున్నారు.
(3 / 7)
100 గ్రాముల కొర్రమీను చేప మాంసంలో 94 కేలరీలు, 16.2 గ్రా ప్రోటీన్, 140 మి.గ్రా కాల్షియం, 0.5 మి.గ్రా ఐరన్, 1080 ఎంసిజి జింక్ ఉంటాయి.
(4 / 7)
కొర్రమీను చేప లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచినీటి చేప అయినందున, దీనిలో పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లం, కొవ్వు ఆమ్లం, లిపోఫిలిక్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒమేగా-3 ని అభివృద్ధి చేస్తాయి. ఈ చేపను తినడం వల్ల శరీరం కాలుష్యం బారిన పడకుండా ఉండడమే కాకుండా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తుంది
(5 / 7)
ఇందులో ఉండే గ్లైసిన్, అరాకిడోనిక్ యాసిడ్ శరీరంలోని గాయాలను మాన్పడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు, ఇది ప్రసవానంతర గాయాలను నయం చేస్తుంది. అలాగే గాయాలు ఉన్నవారు కూడా ఈ చేపను తింటే త్వరగా నయమవుతుంది.
(6 / 7)
కడుపు సంబంధిత సమస్యలకు ఇది మంచి ఔషధం. మలబద్ధకం ఉన్నవారు ఈ చేపను తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధి తామరకు చికిత్స చేస్తుంది. శరీరంలో నొప్పి, మంటను తగ్గిస్తుంది. కీళ్లనొప్పుల నుంచి బయటపడేందుకు చాలా మందికి ఈ చేపను తినడం అలవాటు.
(7 / 7)
ఈ చేపల చర్మంలో ఉండే సెరోటోనెర్జిక్ పదార్థాలు యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తాయి. వీటిలోని పోషక విలువలు శారీరక బలహీనతలను దూరం చేస్తాయి.
ఇతర గ్యాలరీలు