IPL Finisher Dhoni: లాస్ట్ ఓవర్ మొనగాడు.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ఐపీఎల్ ఛేజింగ్ లో ధోని టాప్-5 ఇన్నింగ్స్ ఇవే
- IPL Finisher Dhoni: ఐపీఎల్ అంటేనే హోరాహోరీ మ్యాచ్ లు ఉంటాయి. లాస్ట్ బాల్ వరకూ థ్రిల్లింగ్ గా సాగుతాయి. అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ ల్లో ఆఖరి ఓవర్లలో జట్టును గెలిపించడం ఈజీ కాదు. కానీ ఎంఎస్ ధోనీకి అది కష్టం కాదు. ఈ గ్రేటెస్ట్ ఫినిషర్ ఆడిన ఐపీఎల్ ఛేజింగ్ లో టాప్-5 ఇన్నింగ్స్ మీకోసం.
- IPL Finisher Dhoni: ఐపీఎల్ అంటేనే హోరాహోరీ మ్యాచ్ లు ఉంటాయి. లాస్ట్ బాల్ వరకూ థ్రిల్లింగ్ గా సాగుతాయి. అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ ల్లో ఆఖరి ఓవర్లలో జట్టును గెలిపించడం ఈజీ కాదు. కానీ ఎంఎస్ ధోనీకి అది కష్టం కాదు. ఈ గ్రేటెస్ట్ ఫినిషర్ ఆడిన ఐపీఎల్ ఛేజింగ్ లో టాప్-5 ఇన్నింగ్స్ మీకోసం.
(1 / 5)
2022 ఐపీఎల్ లో ముంబయి తో మ్యాచ్ లో సీఎస్కే గెలవాలంటే చివరి 4 బాల్స్ లో 16 రన్స్ చేయాలి. క్రీజులో ఉన్న ధోని ఒకప్పటిలా చెలరేగిపోయాడు. ఉనద్కత్ బౌలింగ్ లో వరుసగా 6, 4 బాదాడు. ఆ తర్వాత 2 పరుగుుల తీసిన ధోని.. లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. ఆ మ్యాచ్ లో ధోని 13 బంతుల్లోనే అజేయంగా 28 పరుగులు చేశాడు.
(x/bhogleharsha)(2 / 5)
2016 ఐపీఎల్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ఆడిన ధోని అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై అద్భుతమే చేశాడు. చివరి ఓవర్లో 23 పరుగులు అవసరమైతే.. అక్షర్ బౌలింగ్ లో ధోని 3 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు. ఆ ఇన్నింగ్స్ లో ధోని 32 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు.
(x/PunjabKingsIPL)(3 / 5)
2013 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై చివరి 5 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా.. సీఎస్కే అప్పటి కెప్టెన్ ధోని రెచ్చిపోయాడు. ఆశిష్ రెడ్డి బౌలింగ్ లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు. ఆ మ్యాచ్ లో 37 బంతుల్లో ధోని 67 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
(x/TrendsDhoni)(4 / 5)
2010 ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 193 పరుగుల ఛేజింగ్ లోనూ ధోని అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్లో సీఎస్కేకు 16 పరుగులు కావాలి. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో తొలి రెండు బంతుల్లో ధోని 4, 2 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లతో రెండు బంతులు ఉండగానే మ్యాచ్ ముగించాడు.
(x/Cricketfied007)(5 / 5)
2014 ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడిలోనూ ధోని గొప్పగా రాణించాడు. తెలివిగా బౌలింగ్ చేసే పోలార్డ్ ను ధోని బోల్తా కొట్టించాడు. లాస్ట్ ఓవర్లో సీఎస్కే విజయానికి 11 రన్స్ కావాలి. పోలార్డ్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆ వెంటనే ఓ సిక్సర్, ఓ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
(x/ChennaiIPL)ఇతర గ్యాలరీలు