Korean Web Series: లేటెస్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్‌లు ఇవే - ట్విస్ట్‌లకు బుర్ర హీట్ కావడం ఖాయం
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌లతో కూడిన కొరియన్ వెబ్‌సిరీస్‌లు ఇటీవల ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. క్రైమ్, థ్రిల్లర్, సైన్స్‌ఫిక్షన్ జానర్‌లో వచ్చిన ఆ వెబ్‌సిరీస్‌లు ఏవంటే?
(1 / 5)
కొరియన్ సిరీస్ మౌస్ సీజన్ వన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సైకో కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు ఎదురయ్యే పరిణామాలతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. రీసెంట్ టైమ్‌లో అత్యధిక ఐఎమ్‌డీబీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న సిరీస్‌గా మౌస్ నిలిచింది
(2 / 5)
కొరియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఏజెంట్ ఆఫ్ మిస్టరీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఆరు గంటల్లో ఆరుగురు ఏంజెట్స్ కలిసి కొన్ని అంతుచిక్కని రహస్యాలను ఎలా ఛేదించారన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో ఈ సిరీస్ సాగుతుంది.
(3 / 5)
అంధురాలైన అమ్మాయితో ప్రేమలో పడిన బాక్సర్ కథతో కొరియన్ వెబ్‌సిరీస్ ఆల్వేస్ రూపొందింది. లవ్ యాక్షన్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తో పాటు అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(4 / 5)
ప్రయోగాత్మక కథాంశంతో రూపొందిన కొరియన్ వెబ్ సిరీస్ మిస్ నైట్ అండ్ డే ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. రాత్రిళ్లు యాభై ఏళ్ల వృద్ధురాలిగా...పగలు ఇరవై ఏళ్ల యువతిగా ఓ మహిళా ఎలా మారిపోతుందనే పాయింట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందింది.
ఇతర గ్యాలరీలు