(1 / 5)
హిందీ బ్యూటీ మౌనీ రాయ్ గురించి కొంతకాలంగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నదుటికి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే రూమర్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అవసరమా, సర్జరీ వికటించిందా అంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేశారు. ఈ రూమర్లపై ఎట్టకేలకు మౌనం వీడారు మౌనీ.
(2 / 5)
‘ది భూత్ని’ సినిమా ప్రమోషన్లలో మౌనీ రాయ్ ప్రస్తుతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ప్లాస్టిక్ సర్జరీ రూమర్లపై స్పందించారు. తాను సర్జరీ చేయించుకోలేదంటూ మరిన్ని కామెంట్లు చేశారు.
(3 / 5)
తాను రూమర్లను పట్టించుకోనని మౌనీ రాయ్ అన్నారు. ట్రోల్ చేసే వారికి అదే సంతోషమైతే చేసుకోనీయండని చెప్పారు. “అలాంటిదేమీ లేదు. కనీసం చూడరు. ఎవరి పని వారిని చేసుకోనివ్వండి. అలాంటి మాటలను నేను పట్టించుకోను. ఒకవేళ మీరు స్క్రీన్ వెనుక ఉండి ఇతరులను ట్రోల్ చేస్తుంటే.. ఒకవేళ అదే మీకు సంతోషం కలిగిస్తుంటే.. చేసుకోండి” అని మౌనీ అన్నారు.
(4 / 5)
భూత్ని సినిమాలో సంజయ్ దత్ హీరోగా నటించారు. మౌనీ రాయ్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి సిద్ధాంత్ సచ్‍దేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.
ఇతర గ్యాలరీలు