(1 / 5)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది.
(2 / 5)
భూముల బదలాయింపుపై చర్చల తర్వాత 65.038 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించింది. దీనికి రిటర్న్‌గా ప్రభుత్వం 435 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ భూ బదలాయింపులకు సంబంధించి శనివారం హెచ్ఎండీఏ(తెలంగాణ ప్రభుత్వం), రక్షణశాఖ ఉన్నతాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
(3 / 5)
ఈ కీలకమైన ప్రాజెక్ట్ లో భాగంగా… సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వైపు ఒక ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు.
(image source HMDA)(4 / 5)
జింఖానా మైదానం నుంచి హకీంపేట ఎయిర్పోర్ట్స్టేషన్, తూంకుంట, శామీర్‌పేట మీదుగా ఓఆర్ఆర్ వరకూ ఒక ఎలివేటెడ్కారిడార్ నిర్మించనున్నారు. అలాగే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్రోడ్ వరకు మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్కారిడార్ను నిర్మిస్తారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా ముందుకు సాగుతోంది.
(5 / 5)
భూసేకరణకు లైన్ క్లియర్ కావడంతో… త్వరలోనే ఎలివెటేడ్ కారిడార్ ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేయనుంది. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుంది. మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ. ఉండనుండగా… ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.గా ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
(image source HMDA)ఇతర గ్యాలరీలు