తెలుగు న్యూస్ / ఫోటో /
నరకంలో విధించే ఈ శిక్షలు తెలిస్తే గజగజ వణుకుతారు!
- మరణం తర్వాత ఏం జరుగుతుంది? అనేది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. నరకంలో ఏ పాపానికి ఎలాంటి శిక్ష విధిస్తారు? అన్నది కూడా అందులో ఉంది. అవి చాలా భయానకంగా ఉంటాయి. వాటిల్లో కొన్ని ఇక్కడ తెలుసుకుందాము.

(1 / 4)
నరకాలు చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ప్రధానమైనది రౌరవ నరకం.ఇతరులను మోసం చేసే వారు, వారి వస్తువులను లాగేసుకునే వారు రౌరవ నరకానికి వెళతారు. మోసం చేసే వ్యక్తులు రురు అనే సర్ప రూపాన్ని పొందుతారు. వారిని పాములు చుట్టుముట్టి నిరంతరం కాటు వేస్తూ ఉంటాయి. వీళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వేదన ఎలా ఉంటుందో తెలిసొస్తుంది.
(2 / 4)
మహారౌరం అనే నరకం ఇంకా భయంకరంగా ఉంటుంది. తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించిన వాళ్లకు ఇక్కడ శిక్ష పడుతుంది. ఈ నరక రాజ్యంలో క్రవ్యాద అని కూడా పిలిచే రురు జీవులు పాపుల మాంసాన్ని తింటూ హింసిస్తారు. శరీరం నొప్పితో తీవ్రంగా బాధపడినా ఆపవు.
(3 / 4)
అసిపత్రవనము అనే నరకంలో యమ భటులు కొరడాలతో కొట్టి హింస్తారు. కనికరం కూడా లకుండా పరిగెత్తించి మరీ కొడతారు. అపస్మారక స్థితిలో జారుకున్నా, లేపి మరీ శిక్షలు వస్తారు. సొంత వారి బాధ్యతలు విడిచి ఇతరుల కోసం పనులు చేసే వారికి ఈ శిక్ష పడుతుంది.
ఇతర గ్యాలరీలు