Most Runs in 2024: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. లిస్టులో ఏకైక ఇండియన్ ప్లేయర్
- Most Runs in 2024: ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ జాబితాలో ఇండియా నుంచి యశస్వి జైస్వాల్ మాత్రమే ఉన్నాడు.
- Most Runs in 2024: ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ జాబితాలో ఇండియా నుంచి యశస్వి జైస్వాల్ మాత్రమే ఉన్నాడు.
(1 / 5)
Most Runs in 2024: శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుశల్ మెండిస్ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 48 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 37.20 సగటుతో 1860 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెండిస్ 9 టెస్టులు, 17 వన్డేలు, 22 టీ20 మ్యాచ్ లు ఆడాడు.
(AFP)(2 / 5)
Most Runs in 2024: టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 23 మ్యాచ్ లలో 52.08 సగటుతో 1771 రన్స్ చేశాడు. ఈ ఏడాది యశస్వి 15 టెస్టులు, 7 టీ20లు ఆడాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లోనూ అతడు 4 టెస్టుల్లో 359 రన్స్ చేయడం విశేషం. నాలుగో టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు.
(AFP)(3 / 5)
Most Runs in 2024: మరో శ్రీలంక బ్యాటర్ పాథుమ్ నిస్సంక ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. అతను 2024 లో 37 అంతర్జాతీయ మ్యాచ్ లలో 4 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు, 44.63 సగటుతో 1,696 పరుగులు చేశాడు. అతడు 6 టెస్టులు, 12 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.
(AFP)(4 / 5)
Most Runs in 2024: ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 27 మ్యాచ్ లలో 58.33 బ్యాటింగ్ సగటుతో 1575 పరుగులు చేశాడు. అతడు ఈ ఏడాది 12 టెస్టులు, 5 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.
(AFP)ఇతర గ్యాలరీలు