Most Fallowed Actors: అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటీనటులు- టాప్‌లో క్రేజీ హీరోయిన్- ఆఖరులో స్టార్ హీరో-most followed indian actor on instagram priyanka chopra top in list akshay kumar in last shraddha kapoor second place ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Most Fallowed Actors: అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటీనటులు- టాప్‌లో క్రేజీ హీరోయిన్- ఆఖరులో స్టార్ హీరో

Most Fallowed Actors: అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటీనటులు- టాప్‌లో క్రేజీ హీరోయిన్- ఆఖరులో స్టార్ హీరో

Aug 21, 2024, 03:54 PM IST Sanjiv Kumar
Aug 21, 2024, 03:54 PM , IST

Most Fallowed Indian Actors On Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న భారతీయ నటీనటులు ఎవరో తెలుసుకుందాం. వారిలో టాప్‌లో క్రేజీ అండ్ గ్లోబల్ హీరోయిన్ ఉంటే.. ఆఖరుగా స్టార్ హీరో ఉండటం విశేషంగా మారింది. ఈ జాబితాలో అలియా భట్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ ఉన్నారు.

ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న భారతీయ నటి (నటి, నటిమణి కలిపి). ఆమెకు 91.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే తన అప్ కమింగ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నిక్ జోనాస్, మాల్తీ మేరీ, ఆమె తల్లి మధు చోప్రా, చిత్ర తారాగణంతో సహా తన కుటుంబ సభ్యులతో కూడిన ప్యాకప్ చిత్రాన్ని పంచుకున్నారు. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ది బ్లఫ్ చిత్రంలో నటుడు కార్ల్ అర్బన్ కూడా నటించారు. ఇది 19 వ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో సాగుతుంది. ప్రియాంక పోషించిన ఒక మాజీ మహిళా పైరేట్ కథాశంగా తెరకెక్కింది. రుస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ అడ్వెంచర్ గా ఉండబోతోంది. ది బ్లఫ్ తో పాటు జాన్ సెనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కూడా నటించనుంది.

(1 / 10)

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా శ్రద్ధా కపూర్ ఉంది. ఆమె బుధవారం (ఆగస్ట్ 21) నాడు ప్రధాని నరేంద్ర మోదిని దాటేసి మూడో స్థానానికి వచ్చింది. అలాగే, ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటిగా (ప్రియాంక తర్వాత) ఆమె రెండో స్థానంలో ఉన్నారు. ఆమెకు 91.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆమె రాజ్ కుమార్ రావుతో కలిసి బాక్సాఫీస్ హిట్ చిత్రం స్త్రీ 2 లో నటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. 2018లో విడుదలైన స్త్రీ సినిమా హిట్ గా నిలిచింది. ఈ సీక్వెల్ ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. 

(2 / 10)

అలియా భట్ 85.1 మిలియన్ ఫాలోవర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో నటిగా మూడో స్థానంలో ఉంది. అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానున్న 'జిగ్రా'లో ఆమె నటిస్తున్నారు. వాసన్ బాలా చిత్రంలో వేదంగ్ రైనా కూడా నటించారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ లో రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ లతో కలిసి అలియా నటిస్తోంది. అలాగే శివ్ రవైల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆల్ఫా సినిమాలో శర్వారి వాఘ్ తో కలిసి అలియా నటిస్తోంది.

(3 / 10)

కత్రినా కైఫ్ 80.4 మిలియన్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటిగా నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె చివరిసారిగా విజయ్ సేతుపతి సరసన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో నటించింది. అలియా భట్, ప్రియాంక చోప్రాతో కలిసి ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన జీ లే జరా చిత్రంలో కూడా నటిస్తోంది.

(4 / 10)

దీపికా పదుకొణె ఇన్‌స్టాగ్రామ్‌లో 79.8 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో నిలిచింది. 2024 దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సింగం ఎగైన్ చిత్రంలో ఆమె నటించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింగం ఎగైన్ లో రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూపర్ హిట్ ఫ్రాంచైజీలో సింగం ఎగైన్ మూడో భాగం. ఇటీవల కల్కి 2898 ఏడీలో నటించి హిట్ కొట్టింది దీపికా.

(5 / 10)

వాల్తేరు వీరయ్య ఐటమ్ సాంగ్ బ్యూటి ఊర్వశి రౌతేలాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 73 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల సుశీ గణేశన్ దర్శకత్వంలో ఎం.రమేష్ రెడ్డి, జ్యోతిక షెనాయ్, మంజరి సుసి గణేశన్ నిర్మించిన ఘుస్పైతియా చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్ నటిస్తున్నారు.

(6 / 10)

ఇన్‌స్టాగ్రామ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 70.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోనూ సూద్‌తో కలిసి 'ఫతే' చిత్రంలో నటిస్తోంది. సోనూ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. 2025 జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(7 / 10)

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఇన్‌స్టాలో 69.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కిక్, జుడ్వా, ముజ్సే షాదీ కరోగి వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సాజిద్ నదియాడ్వాలాతో కలిసి సికందర్‌లో సల్మాన్‌ను ఆయనను అభిమానులు చూడనున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఈద్ కానుకగా విడుదల కానుంది.

(8 / 10)

అనుష్క శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 68.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోపిక్ 'చక్డా ఎక్స్ ప్రెస్'లో నటిస్తోంది అనుష్క. ఇది ప్రత్యేకంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఇంకా తెలియాల్సి ఉంది.

(9 / 10)

అక్షయ్ కుమార్‌కు ఇన్ స్టాగ్రామ్ లో 67.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నటుడు ఇటీవల ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఖేల్ ఖేల్ మే చిత్రంలో కనిపించాడు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విపుల్ డి షా, అశ్విన్ వర్డే, రాజేష్ బహల్, శశికాంత్ సిన్హా, అజయ్ రాయ్ నిర్మించిన ఖేల్ ఖేల్ మే కామెడీ-డ్రామా జానర్లో, భావోద్వేగాల రోలర్ కోస్టర్ రైడ్‌ను ఈ సినిమా అందించనుంది. తాప్సీ, అమ్మి విర్క్, వాణి కపూర్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు