ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ టాప్ 6 వెబ్ సిరీస్ ఇవే.. కొత్త సీజన్ల కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్.. ఇప్పటికే ఒకటి ఓటీటీలోకి..-most awaited top 6 web series of 2025 panchayat season 4 squid game 3 the family man 3 on prime video netflix ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ టాప్ 6 వెబ్ సిరీస్ ఇవే.. కొత్త సీజన్ల కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్.. ఇప్పటికే ఒకటి ఓటీటీలోకి..

ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ టాప్ 6 వెబ్ సిరీస్ ఇవే.. కొత్త సీజన్ల కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్.. ఇప్పటికే ఒకటి ఓటీటీలోకి..

Published Jun 24, 2025 06:59 PM IST Hari Prasad S
Published Jun 24, 2025 06:59 PM IST

ఈ ఏడాది కొన్ని వెబ్ సిరీస్ కొత్త సీజన్ల కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ వచ్చేయగా.. మరొకటి ఈ వారమే రాబోతోంది. వీటిలో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామాలాంటి జానర్ల సిరీస్ లు ఉన్నాయి. అవేంటో చూడండి.

ఈ మంగళవారం (జూన్ 24) ఓటీటీ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ లలో ఒకటైన పంచాయత్ సీజన్ 4 ఇవాళే వచ్చేసింది. మరొకటి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అప్డేట్ వచ్చింది. మరి వీటితోపాటు ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ఏవో చూడండి.

(1 / 7)

పంచాయత్ సీజన్ 4: పంచాయత్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ మంగళవారం (జూన్ 24) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ కొత్త సీజన్ ఫులేరా గ్రామ పంచాయతీకి ఎన్నికల నేపథ్యంలో వేడెక్కింది. మరి ఆ ఊరికి కొత్త సర్పంచ్ ఎవరో ఈ సీజన్లో చూసేయండి.

(2 / 7)

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2: కే కే మేనన్ మరోసారి రా ఏజెంట్ హిమ్మత్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసారి హైటెక్ సైబర్ టెర్రరిజం, డిజిటల్ చెల్లింపుల రక్షణపై దృష్టి సారించిందీ సిరీస్. జులై 11 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

(3 / 7)

స్క్విడ్ గేమ్ సీజన్ 3 - నెట్‌ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్ గా పేరుగాంచిన స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ వారమే వస్తోంది. జూన్ 27 నుంచి ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

(4 / 7)

కోహ్రా సీజన్ 2: పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కోహ్రా' రెండో సీజన్ కూడా త్వరలో రాబోతోంది. మొదటి సీజన్ మాదిరిగానే, ఇది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే క్రైమ్ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్ లోనే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

(5 / 7)

ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3: మనోజ్ బాజ్ పాయ్ సూపర్ హిట్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ ఈ ఏడాదే రానుంది. మంగళవారం (జూన్ 24) కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. నవంబర్లో ఈ కొత్త సీజన్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

(6 / 7)

ఢిల్లీ క్రైమ్ 3 - షెఫాలీ షా మరోసారి డీఐజీ వర్తికా పాత్రలో కనిపించనున్న సిరీస్ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. ఈసారి కథ ఒక పెద్ద మానవ అక్రమ రవాణా రాకెట్ చుట్టూ తిరుగుతుంది, ఇందులో హుమా ఖురేషి ప్రమాదకరమైన విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకే రానుంది.

(7 / 7)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు